ఇంటర్నెట్ డెస్క్: పెళ్లిలో వధూవరుల స్నేహితులు సందడి చేయడం సహజమే. నిజానికి స్నేహితులు చేసే హడావిడి వల్లే వేడుక కోలాహలంగా జరుగుతుంది. పెళ్లి.. స్నేహితులు.. అనే ప్రస్తావన ఇపుడు ఎందుకొచ్చిందని ఆలోచిస్తున్నారా? ఓ పెళ్లిలో ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌ను వధువు ఓపెన్ చేసి తెల్లముఖం వేసింది. ఇపుడు కూడా ఇది అవసరమా అన్నట్టు రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
యువతి, యువకుడు ఒకరికొకరు నచ్చారు. దీంతో కుుటంబ సభ్యులు వారిద్దరికీ పెళ్లి చేసేందుకు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. వివాహ వేడుకను అంగరంగ వైభవంగా జరిపించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే బంధువులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వధూవరులు పెళ్లి ద్వారా ఒక్కటయ్యారు. వివాహానంతరం వధూవరులు ఇద్దరూ అక్కడే ఏర్పటు చేసిన స్టేజీపైకి వెళ్లారు. బంధువులందరూ ఒక్కొక్కరిగా వధూవరుల వద్దకు వెళ్తూ ఆశీర్వదించి.. వారితో ఫొటోలు దిగుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడకు వచ్చిన వధువు స్నేహితులు.. ఆమెకు ఓ గిఫ్ట్ ఇచ్చారు.
అంతేకాకుండా ఆ గిఫ్ట్ బాక్స్‌ను వెంటనే ఓపెన్ చేయాలంటూ పట్టుబట్టారు. దీంతో చేసేదేమీ లేక.. వధువు గిఫ్ట్ బాక్సును ఓపెన్ చేసింది. అనంతరం అందులో ఉన్న గిఫ్ట్‌ను చూసి కంగుతింది. గిఫ్ట్ బాక్స్‌లో మాస్క్‌లు ఉండటంతో వధువు బిత్తరపోయింది. తర్వాత సంతోష సమయంలో ఇపుడు ఈ మాస్క్ అవసరమా అన్నట్టు రియాక్షన్ ఇచ్చింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. ఈ సన్నివేశాలను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోకాస్తా ఇపుడు వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో స్పందిస్తున్న నెటిజన్లు.. ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి