అందంగా ముస్తాబైన వధువు.. పెళ్లిమంటపానికి వెళ్లకుండా ఆమె చేసిన పనికి నివ్వెరపోయిన స్థానికులు

ABN , First Publish Date - 2022-05-09T21:44:20+05:30 IST

అందంగా ముస్తాబైన వధువు.. బ్యాండ్ మేళంతో పెళ్లిమంటపానికి బయల్దేరింది. అయితే ఆమె తిన్నగా వివాహ వేదిక వద్దకు వెళ్లలేదు. దారి మధ్యలో ఆమె చేసిన పనికి స్థానికులు షాకయ్యారు. అంతేకాకుం

అందంగా ముస్తాబైన వధువు.. పెళ్లిమంటపానికి వెళ్లకుండా ఆమె చేసిన పనికి నివ్వెరపోయిన స్థానికులు

ఇంటర్నెట్ డెస్క్: అందంగా ముస్తాబైన వధువు.. బ్యాండ్ మేళంతో పెళ్లిమంటపానికి బయల్దేరింది. అయితే ఆమె తిన్నగా వివాహ వేదిక వద్దకు వెళ్లలేదు. దారి మధ్యలో ఆమె చేసిన పనికి స్థానికులు షాకయ్యారు. అంతేకాకుండా ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. పూర్తి వివరాలను ఒకసారి పరిశీలిస్తే..


రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన డింపుల్ భస్వర్‌కు ఓ యువకుడితో పెళ్లి ఫిక్సైంది. ఈ క్రమంలోనే ఎరుపు రంగు దస్తులు ధరించి అందంగా ముస్తాబైన ఆమె.. బ్యాండ్ మేళంతో పెళ్లిమంటపానికి బయల్దేరింది. అయితే ఆమె తిన్నగా వివాహ వేదిక వద్దకు వెళ్లలేదు. తొలుత రోడ్డుపై తనకు కనిపించిన శునకాల వద్దకు వెళ్లి వాటికి ఆహారం పెట్టింది. అనంతరం వివాహ వేదిక వద్దకు చేరుకుంది. దీంతో స్థానికులు ఆమె ఫొటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 



ఇదిలా ఉంటే.. తన వివాహం సందర్భంగా మూగజీవాలైన శునకాలు, పక్షులు తదితరల వాటి  కోసం ప్రత్యేక వంటకాలను తయారు చేయించినట్లు డింపుల్ పేర్కొన్నారు. అంతేకాకుండా మూడు రోజులపాటు ఈ ఫుడ్ డ్రైవ్ కొనసాగుతుందని చెప్పారు. ఉదయ్‌పూర్ ఎనిమల్ ఫీడ్ వలంటీర్లతోపాటు తన బంధువులు కూడా ఈ డ్రైవ్‌లో పాల్గొంటారని చెప్పారు. కాగా.. కరోనా సమయంలో ఉదయ్‌పూర్ ఎనిమల్ ఫీడ్ స్వచ్ఛంద సంస్థను స్థాపించిన డింపుల్.. మూగజీవాలకు హాని తలపెట్టవద్దనే కొటేషన్లను డింపుల్ తన పెళ్లి పత్రికపై అచ్చు వేయించింది. 


Read more