పెళ్లికి క‌రోనా బాధితుడు... వ‌ధూవ‌రుల‌తో స‌హా 100 మంది క్వారంటైన్‌!

ABN , First Publish Date - 2020-05-28T12:41:59+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో వివాహం జరిగిన కొద్ది గంటల‌కే ఆ వ‌ధూవ‌రులు క్వారంటైన్‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. వివాహ వేడుకకు హాజరైన ఒక వ్య‌క్తి కరోనా పాజిటివ్ అని తేలడంతో క‌ల్యాణ మండ‌పంలో...

పెళ్లికి క‌రోనా బాధితుడు... వ‌ధూవ‌రుల‌తో స‌హా 100 మంది క్వారంటైన్‌!

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో వివాహం జరిగిన కొద్ది గంటల‌కే ఆ వ‌ధూవ‌రులు క్వారంటైన్‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. వివాహ వేడుకకు హాజరైన ఒక వ్య‌క్తి కరోనా పాజిటివ్ అని తేలడంతో క‌ల్యాణ మండ‌పంలో ఆందోళ‌న నెల‌కొంది. ఫ‌లితంగా ఈ కొత్త జంట మాత్రమే కాకుండా. ఈ ఇరు  కుటుంబాలకు చెందిన 100 మందికి పైగా బంధువులు క్వారంటైన్ సెంట‌ర్‌కు త‌ర‌లివెళ్లారు. ఢిల్లీకి చెందిన ఓ యువకునికి క‌రోనా సోకింది. అయితే అంత‌కు ముందు అత‌ను బంధువుల ఇంట్లో జ‌రిగే పెళ్లికి హాజ‌ర‌య్యాడు. ఈ ఉదంతం గురించి చింద్వారా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రాజేష్ షాహి మాట్లాడుతూ, మూడు నాలుగు రోజుల క్రితం నుంచి ఢిల్లీకి చెందిన ఆ వ్య‌క్తిలో కోవిడ్-19 లక్షణాలు క‌నిపించాయ‌న్నారు. దీంతో అత‌ని న‌మూనాల‌ను వైద్యప‌రీక్ష‌ల‌కు పంప‌గా, క‌రోనా పాజిటివ్ అని తేలిందన్నారు. అయితే ఇంత‌లోనే అత‌ను త‌న బంధువుల ఇంట జ‌రిగిన పెళ్లికి హాజ‌ర‌య్యాడ‌న్నారు. దీంతో వ‌ధూవ‌రుల‌తో పాటు పెళ్లికి హాజ‌రైన‌వారంద‌రినీ క్వారంటైన్‌కు త‌ర‌లించామ‌న్నారు.

Updated Date - 2020-05-28T12:41:59+05:30 IST