రూ.2.5 కోట్ల కట్నం.. కూతుర్ని ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఇచ్చి పెళ్లి చేస్తే.. నెల రోజుల తర్వాత అతడు ఇచ్చిన ట్విస్ట్‌ ఇదీ..!

ABN , First Publish Date - 2021-11-21T13:01:01+05:30 IST

మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే వరుడు.. కోట్ల ఆస్తి ఉన్న పెళ్లికూతురు. భారీ కట్నంతో అత్యంత వైభవంగా తాజ్ ప్యాలెస్ హోటల్‌లో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన నెల నుంచే భార్యభర్తల మధ్య గొడవలు. ఆ తరువాత నుంచి పుట్టింట్లోనే భార్య. ఇప్పుడు భర్త అమెరికా వెళ్లిపోవడంతో ఆమె గృహహింస కేసు నమోదు చేసింది. అత్త మామలపై కూడా చీటింగ్ కేసు పెట్టింది...

రూ.2.5 కోట్ల కట్నం.. కూతుర్ని ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఇచ్చి పెళ్లి చేస్తే.. నెల రోజుల తర్వాత అతడు ఇచ్చిన ట్విస్ట్‌ ఇదీ..!

మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే వరుడు.. కోట్ల ఆస్తి ఉన్న పెళ్లికూతురు. భారీ కట్నంతో అత్యంత వైభవంగా తాజ్ ప్యాలెస్ హోటల్‌లో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన నెల నుంచే భార్యభర్తల మధ్య గొడవలు. ఆ తరువాత నుంచి పుట్టింట్లోనే భార్య. ఇప్పుడు భర్త అమెరికా వెళ్లిపోవడంతో ఆమె గృహహింస కేసు నమోదు చేసింది. అత్త మామలపై కూడా చీటింగ్ కేసు పెట్టింది.


మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇందోర్‌లో నివసించే విశాల్ అగ్రవాల్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి అదే నగరానికి చెందిన వ్యాపారి అనిల్ మంగల్ కుమార్తె నిధి మంగల్‌తో గత ఏప్రిల్ నెలలో వివాహం జరిగింది. వివాహానికి ముందు ఎంగేజ్‌మెంట్ వేడుకలోనే మామగారు అనిల్ మంగల్ కాబోయే అల్లుడికి రూ.70 లక్షలు కానుకగా ఇచ్చారు. ఆ తరువాత పెళ్లిలో పెళ్లికొడుకు తండ్రి రూ.90 లక్షలు కట్నం తీసుకున్నారు. అనిల్ మంగల్ తన ఒక్కగానొక్క కూతురి పెళ్లి రాజస్థాన్‌లోనే చాలా ఖరీదైన ఉదయ్‌పూర్ తాజ్ లేక్ ప్యాలెస్ హోటల్‌లో వైభవంగా చేశారు.


పెళ్లి తరువాత కూడా ఇంకా కట్నం డిమాండ్ చేయడంతో మరో రూ.90 లక్షలు ఇచ్చారు. కానీ ఆ తరువాత నిధికి తన భర్త విశాల్ గురించి ఇరుగుపొరుగు వారి నుంచి కొంత తెలిసింది. విశాల్‌కు ఇంతకుముందు రెండు వివాహాలు జరిగాయని, వారి వద్ద కూడా భారీ మొత్తంలో కట్నం తీసుకున్నాడని నిధి తెలుసుకొని విశాల్‌తో గొడవపడేది. అలాంటిదేమీ లేదని విశాల్ చెప్పాడు. కొన్ని రోజుల తరువాత ఉద్యోగ రీత్యా విశాల్ అమెరికా వెళ్లిపోయాడు. అప్పటి నుంచి నిధి తన పుట్టింట్లోనే ఉంటోంది.


ఇప్పుడు నిధి తన భర్త, అత్త మామలు మోసగాళ్లని, కట్నం కోసం తనను హింసించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విశాల్, అతని తల్లిదండ్రులపై గ‌ృహహింస కేసు నమోదు చేశారు. విశాల్ తండ్రిని విచారణ చేయగా.. తన కోడలు చెప్పినవన్నీ అబద్ధాలని చెప్పాడు. కట్నం కోసం తామేమి వేధించలేదని.. అంతా వారే కానుకగా ఇచ్చారని అన్నాడు. ఎంగేజ్‌మెంట్ జరిగిన హోటల్ బిల్లు కూడా తానే కట్టానని ఆయన పేర్కొన్నాడు.


నిధి తల్లిదండ్రులు భార్యభర్తల మధ్య అభిప్రాయభేదాలతో వచ్చిన గొడవను పెద్దదిగా చేసి తన పరువు తీయాలనే ఇలా చేస్తున్నారని విశాల్ తండ్రి ఆరోపణలు చేశాడు. విశాల్‌కు ఇంతకుముందు ఏ పెళ్లి జరగలేదని.. అవన్నీ గిట్టనివారు చేసిన పుకార్లని, ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లిన విశాల్ త్వరలోనే వస్తాడని ఆయన చెప్పాడు.

Updated Date - 2021-11-21T13:01:01+05:30 IST