అసలు విషయాన్ని దాచి వివాహానికి రెడీ అయిన వరుడు.. తాళికట్టే కొద్ది క్షణాల ముందు నిజం బట్టబయలు.. దీంతో వధువు..

ABN , First Publish Date - 2022-05-22T23:04:07+05:30 IST

కూతురుకు పెళ్లీడు రావడంతో అందరి తల్లిదండ్రల్లాగానే ఆమె తల్లిదండ్రులు కూడా సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఓ అబ్బాయిని చూశారు. యువకుడు చూడటానికి చక్కగా ఉండటంతో యువతి కూడా పెళ్లికి ఓకే చెప్పేసింది. అయితే

అసలు విషయాన్ని దాచి వివాహానికి రెడీ అయిన వరుడు.. తాళికట్టే కొద్ది క్షణాల ముందు నిజం బట్టబయలు.. దీంతో వధువు..

ఇంటర్నెట్ డెస్క్: కూతురుకు పెళ్లీడు రావడంతో అందరి తల్లిదండ్రల్లాగానే ఆమె తల్లిదండ్రులు కూడా సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఓ అబ్బాయిని చూశారు. యువకుడు చూడటానికి చక్కగా ఉండటంతో యువతి కూడా పెళ్లికి ఓకే చెప్పేసింది. అయితే తాళికట్టే కొద్ది క్షణాల ముందు అబ్బాయికి సంబంధించిన ఓ నిజం బయటపడటంతో వధువు కుటుంబ సభ్యులు షాకయ్యారు. ఈ నేపథ్యంలో వధువు కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..



ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ ప్రాంతానికి చెందిన ఓ యువతి కుటుంబ సభ్యులు చూసిన సంబంధానికి ఓకే చెప్పి పెళ్లికి సిద్ధం అయింది. దీంతో సదరు అబ్బాయితో పెళ్లి జరిపించడానికి ఆ యువతి తల్లిదండ్రులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. అయితే తాళికట్టడానికి కొద్ది క్షణాల ముందు.. వరుడు వివాహ వేదిక వద్ద స్పృహ తప్పి పడిపోవడంతో అతడికి సంబంధించిన సంచలన నిజం బయటపడింది. అతడికి బట్ట తల ఉందని.. దాన్ని కవర్ చేయడానికి విగ్గు ఉపయోగిస్తున్నాడనే విషయం వధువు, ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో ఒక్కసారిగా వారంతా షాకయ్యారు. ఈ నేపథ్యంలోనే అతడిని పెళ్లి చేసుకునేందుకు వధువు నిరాకరించింది. కుటుంబ సభ్యులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వధువు మాత్రం తన మనసు మార్చుకోలేదు. దీంతో పెళ్లి ఆగిపోయింది.


ఈ నేపథ్యంలోనే వధువు కుటుంబ సభ్యులు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. బట్టతల విషయం దాచినందుగాను పెళ్లి కోసం తాము ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగిచ్చేయాలని పట్టుబట్టారు. చేసేదేమీ లేక వరుడి కుటుంబ సభ్యులు.. సుమారు రూ. 5.66లక్షలను వధువు కుటుంబ సభ్యులకు చెల్లించారు. దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. 


Updated Date - 2022-05-22T23:04:07+05:30 IST