Wedding Contract: జిమ్‌లో వర్కవుట్స్ నుంచి రోజూ చీర కట్టుకోవడం వరకు.. నెట్టింట హాట్‌టాపిక్‌గా మారిన ‘పెళ్లి నిబంధనలు’..

ABN , First Publish Date - 2022-07-15T22:08:08+05:30 IST

అసోంకు చెందిన శాంతి, మింటూ జంట నూతనంగా వైవాహికంగా జీవితంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా వారిద్దరూ ఓ కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్నారు.

Wedding Contract: జిమ్‌లో వర్కవుట్స్ నుంచి రోజూ చీర కట్టుకోవడం వరకు.. నెట్టింట హాట్‌టాపిక్‌గా మారిన ‘పెళ్లి నిబంధనలు’..

`15 రోజులకు ఒకసారి మాత్రమే షాపింగ్‌ చేయాలి.. నెలకోసారే పిజ్జా తినాలి.. ప్రతిరోజూ ఇంట్లో వంటనే తినాలి.. ప్రతిరోజూ జిమ్‌కి వెళ్లాలి.. ప్రతిరోజూ చీర కట్టుకోవాలి..` ఏంటి.. ఇవన్నీ న్యూ ఇయర్ రెజెల్యూషన్స్  అనుకుంటున్నారా? అవును.. కాకపోతే ఇవి న్యూ ఇయర్ సందర్భంగా తీసుకున్నవి కాదు.. పెళ్లి సందర్భంగా వధూవరులు చేసుకున్న కాంట్రాక్ట్‌లోనివి. అసోంకు చెందిన శాంతి, మింటూ జంట నూతనంగా వైవాహికంగా జీవితంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా వారిద్దరూ ఓ కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్నారు. పెళ్లి తర్వాత ఎలా జీవించాలో ముందుగానే హామీ పత్రం రాసుకున్నారు. 


ఇది కూడా చదవండి..

Second Marriage Rules: ప్రభుత్వ ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోవాలంటే.. కొత్త రూల్స్‌ను ప్రకటించిన Bihar సర్కారు


పెళ్లి దుస్తుల్లోనే ఉన్న వధూవరులు కాంట్రాక్ట్‌ పేపర్‌పై సంతకం పెడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ Wedding Contractపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఈ `వెడ్డింగ్‌ కాంట్రాక్ట్‌` బాగుందని కొందరు కామెంట్లు చేశారు. `అది పెళ్లి కాదు.. బిజినెస్ డీల్` అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అలాగే ప్రతిరోజు చీర మాత్రమే కట్టుకోవాలనడం చాలా దారుణమని ఒకరు వ్యాఖ్యానించారు. భారత్‌లో ఇంకా అసమానతలు కొనసాగతూనే ఉన్నాయనడానికి ఈ పెళ్లి ఓ తార్కాణం అని మరొకరు పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-15T22:08:08+05:30 IST