Viral Video.. బంధువులంతా చూస్తుండగానే పెళ్లి వేదికపైనే ఈ వధూవరులు ఏం చేశారో మీరే చూడండి..

ABN , First Publish Date - 2021-08-05T17:40:31+05:30 IST

పెళ్లి వేడుకలో ఉండే సందడి అంతా ఇంతా కాదు.. స్నేహితులు, బంధువుల ఒక చోట చేరి ఉత్సాహంగా గడిపే వేడుక పెళ్లి..

Viral Video.. బంధువులంతా చూస్తుండగానే పెళ్లి వేదికపైనే ఈ వధూవరులు ఏం చేశారో మీరే చూడండి..

పెళ్లి వేడుకలో ఉండే సందడి అంతా ఇంతా కాదు.. స్నేహితులు, బంధువుల ఒక చోట చేరి ఉత్సాహంగా గడిపే వేడుక పెళ్లి.. ప్రస్తుతం పెళ్లికి ముందు సంగీత్ కార్యక్రమం చాలా సాధారణం అయిపోయింది.. ఈ వేడుకలో స్నేహితులు, బంధువులు కలిసి డ్యాన్స్‌లేస్తుంటారు.. అయితే ఓ పెళ్లిలో మాత్రం వధువు, వరుడు కలిసి చిందులేశారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


ఈ వీడియోను నిరంజన్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.. ఈ వీడియోలో వరుడు ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ వేశాడు.. అతడితో కలిసి డ్యాన్స్ వేసేందుకు ముందు సిగ్గుపడిన వధువు తర్వాత తను కూడా కాలు కదిపింది.. బంధువులు, స్నేహితులు చూస్తుండగా వారిద్దరూ ఫుల్ జోష్‌తో డ్యాన్స్ చేశారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వేల కొద్దీ లైకులు దక్కించుకుంటోంది. 



Updated Date - 2021-08-05T17:40:31+05:30 IST