రెవెన్యూశాఖపై లంచగొండి ముద్ర!

ABN , First Publish Date - 2022-07-04T09:29:38+05:30 IST

రెవెన్యూశాఖపై లంచగొండి ముద్ర!

రెవెన్యూశాఖపై లంచగొండి ముద్ర!

ప్రభుత్వం ఒక్క రూపాయీ ఇవ్వట్లేదు 

స్టేషనరీకీ ఉద్యోగులు ఎలా ఖర్చు చేయాలి?: బొప్పరాజు

ఏపీజేఏసీ అమరావతిలో మూడు సంఘాల విలీనం 

విజయవాడ, జూలై 3(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖపై అవినీతి ముద్ర పడే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావద్దని ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌(ఏపీఆర్‌ఎ్‌సఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. తీవ్ర పని ఒత్తిడి ఎదుర్కొంటున్న ఈ శాఖకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విదిలించటం లేదని, స్టేషనరీ ఖర్చులకూ దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం, ఏపీ డైరెక్ట్‌ వీఆర్‌వో రిక్రూట్‌మెంట్‌ సంఘం, ఏపీ గ్రేడ్‌-2 గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆదివారం అమరావతి జేఏసీలో విలీనమయ్యాయి. అనంతరం విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్‌లో విలేకరుల సమావేశంలో బొప్పరాజు మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి  స్టేషనరీ ఖర్చులకు కూడా డబ్బులు రావటం లేదని, ఈ డబ్బులను ఉద్యోగి ఎక్కడ నుంచి తేగలడని ప్రశ్నించారు. రెవెన్యూ శాఖపై అపవాదులు వస్తున్నాయని, రెవెన్యూ అంటేనే విపరీతమైన లంచగొండిగా ముద్ర వేస్తున్నారని తెలిపారు. శాఖపై మరింతగా అవినీతి ముద్ర పడే పరిస్థితిని ప్రభుత్వం తీసుకు రావద్దని కోరారు. 

Updated Date - 2022-07-04T09:29:38+05:30 IST