పోలీస్టేషన్లోనే లంచం!

ABN , First Publish Date - 2020-09-22T10:51:38+05:30 IST

ఏసీబీ అధికారులకు ఓ ఏఎస్‌ఐ అడ్డంగా దొరికిపోయాడు. కలికిరి ఏఎ్‌సఐగా పనిచేస్తున్న దామోదరం సోమవారం పోలీసు స్టేషన్‌లోనే

పోలీస్టేషన్లోనే లంచం!

ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కలికిరి ఏఎ్‌సఐ


కలికిరి, సెప్టెంబరు 21: ఏసీబీ అధికారులకు ఓ ఏఎస్‌ఐ అడ్డంగా దొరికిపోయాడు. కలికిరి ఏఎ్‌సఐగా పనిచేస్తున్న దామోదరం సోమవారం పోలీసు స్టేషన్‌లోనే రూ. 10 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తిరుపతి ఏసీబీ డీఎస్పీ వి.అల్లాబక్షు కథనం మేరకు.. ఏర్పేడు మండలం తుమ్మరగుంటకు చెందిన టి.


అంకయ్య కలికిరి మండలం గుట్టపాళెం పంచాయతీ ఈతమాను బస్టాప్‌ వద్ద ఉండే సాసూను గత ఏడాది ఆగస్టులో వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తిన నేపథ్యంలో సాసూ ఫిర్యాదు మేరకు ఈ యేడాది ఆగస్టు 11న భర్త అంకయ్యతోపాటు మరో ఆరుగురు కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఆ తరువాత అంకయ్యతోపాటు ఏడుగురికీ స్టేషన్‌ బెయిలు మంజూరైంది.


అప్పటి నుంచి కలికిరి పోలీసు స్టేషనులో ఏఎ్‌సఐగా పనిచేస్తున్న దామోదరం అంకయ్యకు ఫోను చేసి బెయిలు మంజూరు చేసినందుకు రూ.15 వేలు లంచం డిమాండు చేసేవాడు. ఇవ్వకపోతే చీటింగ్‌ కేసులు నమోదు చేస్తామని బెదిరించేవాడు. చివరికి రూ.10 వేలు ఇచ్చేందుకు అంకయ్య అంగీకరించినట్లు నటించి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.వారి సూచన మేరకు సోమవారం అంకయ్య నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా అక్కడే వున్న ఏసీబీ అధికారుల బృందం ఏఎ్‌సఐని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.


అదుపులోకి తీసుకుని స్టేషన్లో కేసుకు సంబంధించిన ఫైళ్ళను పరిశీలించింది.దామోదరాన్ని అరెస్టు చేశామని, నెల్లూరు కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ అల్లాబక్షు వివరించారు.  ఈ దాడుల్లో మరో డీఎస్పీ కె. జనార్దన నాయుడు, ఇన్‌స్పెక్టర్లు    జి. ప్రసాద్‌ రెడ్డి, పి. నాగేంద్ర, ఎస్‌ఐ విష్ణువర్ధన్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-09-22T10:51:38+05:30 IST