Advertisement
Advertisement
Abn logo
Advertisement

Brian Lara: కోహ్లీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం

న్యూఢిల్లీ: ఐపీఎల్ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు విరాట్ కోహ్లీ చేసిన ప్రకటనపై విండీస్ గ్రేట్ బ్రియాన్ లారా స్పందించాడు. కోహ్లీ నిర్ణయాన్ని సమర్థించాడు.


టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన కోహ్లీ రెండు రోజులు కూడా గడవకుండానే ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే, కెరియర్ ఉన్నంత వరకు ఆర్సీబీలోనే కొనసాగుతానని స్పష్టం చేశాడు. 


కోహ్లీ తాను చెప్పాల్సిందేదో సూటిగా చెప్పాడని, కెరియర్ ఉన్నతంగా ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని చూసి గర్వించాలని అన్నాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ తన బాధ్యతల నుంచి మాత్రం తప్పుకోవాలని కోహ్లీ అనుకోలేదన్నాడు. అతడి నిర్ణయాన్ని తాను పూర్తిగా అర్థం చేసుకున్నానని పేర్కొన్న లారా.. ఇది మూడు ఫార్మాట్ల గేమ్ అని, గతంలో టెస్టు, వన్డే క్రికెట్ మాత్రమే ఉండేదని గుర్తు చేశాడు.


కోహ్లీ ఇప్పుడు ప్రతీ ఫార్మాట్ ఆడుతున్నాడని అన్నాడు. కోహ్లీ తనపై ఉన్న వర్క్ లోడ్‌ను అర్థం చేసుకోవాలనుకుంటున్నాడని అన్నాడు. కెరియర్ ఓ స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయమని లారా ప్రశంసించాడు.

Advertisement
Advertisement