ఒంటరి మహిళలకు వరం పెరటి కోళ్ల పెంపకం

ABN , First Publish Date - 2020-11-28T05:13:40+05:30 IST

షెడ్యూల్డ్‌ కులాల్లో ఒంటరిగా నివసిస్తున్న మహిళల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెరటికోళ్ల పెంపకం వరంగా మారింది. ప్రయోగాత్మకంగా ప్రాజెక్టు అమలుకు కరీంనగర్‌ జిల్లాను ఎంపిక చేసి మొదటి విడతగా 100 యూనిట్లు మం జూరు చేశారు.

ఒంటరి మహిళలకు వరం పెరటి కోళ్ల పెంపకం
లబ్ధిదారులకు కోడిపిల్లలు, సామగ్రిని పంపిణీ చేస్తున్న ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శర్మ

 ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో పథకం  ఫ  పైలెట్‌ ప్రాజెక్టుగా గ్రామానికి ఒక యూనిట్‌ 

100 యూనిట్ల మంజూరు, 36 యూనిట్ల గ్రౌండింగ్‌ పూర్తి  ఫ  లబ్ధిదారుల్లో వెల్లివిరుస్తున్న ఆనందం

గణేశ్‌నగర్‌, నవంబరు 27: షెడ్యూల్డ్‌ కులాల్లో ఒంటరిగా నివసిస్తున్న మహిళల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెరటికోళ్ల పెంపకం వరంగా మారింది. ప్రయోగాత్మకంగా ప్రాజెక్టు అమలుకు కరీంనగర్‌ జిల్లాను ఎంపిక చేసి మొదటి విడతగా 100 యూనిట్లు మం జూరు చేశారు. వీటి లో ఇప్పటి వరకు 36 యూనిట్లు మంజూరు పూర్తయ్యాయి. గ్రామానికో యూనిట్‌ చొప్పున పంపిణీ చేయగా జిల్లాలోని పలు గ్రామాల్లో లబ్దిదారులు ఆశించిన మేరకన్నా అధిక శ్రద్ధతో యూనిట్లను తీసుకుంటున్నారు. రూ. 50 వేల విలువచేసే 150 కోడి పిల్లలు, దాణా, ఫీడెర్స్‌, డ్రిం కర్స్‌, షెడ్డు నిర్మాణానికి 10, 250 రూపాయలు పంపిణీ చేస్తుండగా ఇ ప్పటి వరకు 50 యూ నిట్లకు 25 లక్షల రూ పాయలు ఎస్సీ కార్పొరేషన్‌ విడుదల చేసింది. జిల్లాలోని పలు మండలాల్లో ఇప్పటి వరకు గ్రామానికి ఒకరు చొ ప్పు న 100 మందిని ఎంపికచేసి 36 యూనిట్లు గ్రౌం డింగ్‌ పూర్తి చేశారు. మార్చి 2021 వరకు 100 యూ నిట్లు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మార్కెట్‌లో అత్యధిక ఆదరణ గల దేశవాళి కోళ్లతోపాటు గిరిరాజా, వనరాజా, కడక్‌నాథ్‌ లాంటి పలురకాల కోళ్లు లబ్ధి దారుల చేతికి అందివచ్చి, గుడ్లు కూడా పెడుతుండగా అటు అధికారులు, ఇటు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయ కోళ్లకు, గుడ్లకు మంచి గిరాకీ లభిస్తుండగా ఈ పథకం తమకు లాభసాటి గా మారిందని లబ్దిదారులు పేర్కొంటున్నా రు. నిత్యం తాము సంపాదించే కూలికన్నా మూడింతలు తమకు గిట్టుబాటు అవుతుందని స్పష్టం చేస్తున్నారు. పెరటి కోళ్ల పెంపకం లో లాభాల గురించి అధికారులు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తు న్నారు. వినియోగదారులు ఎక్కువగా నాటుకోళ్లపై ఆసక్తి కనబరు స్తూ ఉండటం పెరటి కోళ్ల పెంపకానికి తో డ్పాటు అందిస్తోంది.  


Updated Date - 2020-11-28T05:13:40+05:30 IST