‘ఊకచెట్టు’తో ఊపిరి

ABN , First Publish Date - 2021-04-16T05:23:25+05:30 IST

చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో పంటలకు భరోసా ఏర్పడింది.

‘ఊకచెట్టు’తో ఊపిరి
ఊకచెట్టువాగుపై లాల్‌కోట వద్ద నిర్మించిన చెక్‌డ్యామ్‌ ఎగువన నిల్వ ఉన్న నీరు

- చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో ఊకచెట్టువాగుకు జలకళ

- మూడు చోట్ల మూడు కిలోమీటర్ల మేర నీటి నిల్వ

- మూడు మండలాల్లో యాసంగి పంటలకు భరోసా 

- 12 గ్రామాల పరిధిలోని బోర్లలో పెరిగిన నీటి లభ్యత

- ఇసుక తవ్వకాలను పూర్తిగా నిషేధించాలని రైతుల డిమాండ్‌


మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 15 (ఆధ్రజ్యోతి ప్రతినిధి) : చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో పంటలకు భరోసా ఏర్పడింది. రెండు పంటలకు సరిపడా నీటి లభ్యత ఏర్పడింది. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర నియోజ కవర్గంలోని కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు దిగువ నుంచి రామన్‌పాడు రిజర్వా యర్‌ వరకు ఉన్న ఊకచెట్టు వాగుపై నిర్మించిన చెక్‌ డ్యామ్‌లతో వాగు పరివాహక ప్రాంతం ప్రస్తుతం పచ్చదనాన్ని సంతరించుకున్నది. గ తంలో ఈ వాగులో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేపట్టడంతో రూ పం కోల్పోయింది. దీంతో వాగును పునరుజ్జీవింపజేసేందుకు తొ మ్మిది చోట్ల చెక్‌డ్యాములు నిర్మించాలని ప్రతిపాదించగా, వీటిలో మూడింటి నిర్మాణాలు పూర్తయ్యాయి. బండర్‌పల్లి, లాల్‌కోట, అల్లీపూర్‌ వద్ద చేపట్టిన చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు పూర్తవగా, ముచ్చింతల, పల్లమర్రి, చిన్నవడ్డెమాన్‌, కురుమూర్తి వద్ద ప్రస్తుతం నిర్మాణాలు సాగుతున్నాయి. చెక్‌డ్యాములు పూ ర్తయ్యి వినియోగంలోకి వచ్చిన బండర్‌పల్లి, లాల్‌కోట వ ద్ద ప్రస్తుతం వాగులో ఒక్కో చోట మూడు కిలోమీటర్ల వరకు నీరు నిలిచి ఉంది. దీంతో ఈ పరివాహక పరిస రాల్లోని మరికల్‌, దేవరకద్ర, సీసీకుంట మండలాల్లోని రా కొండ, గురకొండ, బండర్‌పల్లి ,సీసీకుంట, గోప్లాపూర్‌, పల్ల మర్రి, లాల్‌కోట, నెల్లికొండి, అప్పంపల్లి, దాసర్‌పల్లి తదితర గ్రామాల పరిధిలోని దాదాపు 1,200 బోరు బావులకు నీటి లభ్య త పెరిగింది. చెక్‌డ్యాములు లేకమునుపు కోయిలసాగర్‌ నిండినప్పు డు, వరదలొచ్చిన సమయంలో మాత్రమే ఊకచెట్టువాగు ప్రవహించే ది. వానాకాలం పంటలకు మాత్రమే భూగర్భ జలాలు సరిపోయేవి. తాజాగా ఈ ప్రాంతంలో చెక్‌డ్యామ్‌ల ప్రభావంతో యాసంగిలో కూడా నీటి లభ్యత పెరిగింది. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పంట చేతికందుతోంది. ఈ రెం డు చెక్‌డ్యామ్‌ల పరిధిలో ప్రస్తుత యాసంగిలో దాదాపు మూడు వేల ఎక రాల వరకు వరి పంటలు సాగయ్యాయి.


ఇసుక తవ్వకాలు నిలిపివేస్తే ప్రయోజనం

విపరీతమైన ఇసుక తవ్వకాలతో దాదాపు రూపు కోల్పోయిన ఊకచెట్టువా గు మళ్లీ పునరుజ్జీవింపజేసే చర్యలపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, చెక్‌డ్యామ్‌ల ఫలాలు రైతులకు శాశ్వతంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రధానంగా వాగులో విచ్చలవిడిగా సాగే ఇసుక తవ్వకాలను నియంత్రించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీన్ని నియంత్రిస్తే ఈ ప్రాంతం మళ్లీ సస్యశ్యామలమయ్యేందుకు దోహద పడుతుందని చెబుతున్నా రు. ఆ దిశగా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2021-04-16T05:23:25+05:30 IST