ఆదాయానికి బ్రేకులు!

ABN , First Publish Date - 2021-06-09T04:53:39+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా ఆర్టీసీ ఆదాయాని కి బ్రేకులు పడ్డాయి. కరోనా వైరస్‌ ఆర్టీసీని నష్టాల ఊబిలోకి నెట్టేస్తోంది. ఒక్కో డిపో పరిధిలో నెలసరి కోటి రూపాయల నష్టం తప్పడం లేదు. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల పరి ధిలో ఆరు ఆర్టీసీ డిపోలు ఉండగా.. అన్ని డిపోలలో ఇదే పరిస్థితి నెలకొంది.

ఆదాయానికి బ్రేకులు!

కరోనా ప్రభావంతో ఆర్టీసీకి తీవ్ర నష్టాలు

ఒక్కో డిపోలో నెలకు కోటి రూపాయల పైనే..

ఏడాదిగా అన్నిఆర్టీసీ డిపోలలో ఇదే పరిస్థితి

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఆరు ఆర్టీసీ డిపోలు

లాక్‌డౌన్‌ ఎత్తేసినా ప్రయాణికులు బస్సులు ఎక్కడం గగనమే!

మరికొన్ని రోజులూ ఇదే పరిస్థితి

బోధన్‌, జూన్‌ 8: లాక్‌డౌన్‌ కారణంగా ఆర్టీసీ ఆదాయాని కి బ్రేకులు పడ్డాయి. కరోనా వైరస్‌ ఆర్టీసీని నష్టాల ఊబిలోకి నెట్టేస్తోంది. ఒక్కో డిపో పరిధిలో నెలసరి కోటి రూపాయల నష్టం తప్పడం లేదు. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల పరి ధిలో ఆరు ఆర్టీసీ డిపోలు ఉండగా.. అన్ని డిపోలలో ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపు పదిహేను నెలల కాలంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. తొలి విడత కరోనా ప్రభావం మొ దలైనప్పటి నుంచి నేటి వరకు ఆర్టీసీలో నష్టాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఒక్కో డిపోలో దాదాపు 15 నెలల కా లానికి రూ.15కోట్లపైనే నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితులు ఆర్టీసీని ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి. అసలే అంతంత మాత్రం ఆదాయంతో నడుస్తున్న ఆర్టీసీపై కరోనా ప్రభావం పడడంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మా రింది. అన్నీ అనుకూలంగా ఉండి.. ఆర్టీసీ బస్సులన్నీ పూర్తి గా నడిచిన కాలంలోనే ఆర్టీసీకి నష్టాలు తప్పలేదు. ఇప్పుడు కరోనా వల్ల బస్సులు నడవక, సగం బస్సులు డిపోలలోనే ఉంటుండడంతో ఆర్టీసీకి మరిన్ని నష్టాలు తప్పడం లేదు.

ఉమ్మడి జిల్లాలో ఆరు డిపోలు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఆరు ఆర్టీసీ డిపోలు ఉ న్నాయి. నిజామాబాద్‌ 1, నిజామాబాద్‌ 2, బోధన్‌, ఆర్మూర్‌, బాన్సువాడ, కామారెడ్డి డిపోలు రెండు జిల్లాల పరిధిలో ఉ న్నాయి. ఒక్కో డిపోలో సుమారు 100 నుంచి 150 వరకు ఆర్టీసీ బస్సులున్నాయి. ఒక్కో డిపోలో రోజువారి 13లక్షల రూపాయల నుంచి 15లక్షల రూపాయల వరకు ఆదాయం సమకూరేది. అయితే, ఒక్కో డిపోలో రోజువారి 17లక్షల రూ పాయల నుంచి 20లక్షల రూపాయల వరకు ఖర్చు ఉంటు ంది. అన్ని బస్సులు అన్ని రూట్లలో సక్రమంగా నడిచి పూ ర్తిస్థాయిలో ఆదాయం వచ్చినా ఒక్కో డిపోలో రోజువారి రూ.7లక్షల నుంచి రూ.10లక్షల వరకు నష్టం ఉండేది. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్‌ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ పరిస్థితి అధ్వానంగా మారింది. గత ఏడాది మార్చిలో కరోనా వైరస్‌ వల్ల లాక్‌డౌన్‌ మొదలవగా దాదాపు 15 నెలల కాలం నుంచి ఇవే పరిస్థితులు కొనసాగుతూ వస్తున్నాయి. ప్రతినెలా ఒక్కో డిపో పరిధిలో కోటి రూపాయల నష్టం వా టిల్లుతోంది. ఒక్కో డిపోలో ఏడాదికి రూ.12కోట్ల నుంచి రూ. 15కోట్ల వరకు నష్టం వస్తోంది. దాదాపు ఉమ్మడి జిల్లాల ప రిధిలో ఆరు డిపోలలో 15నెలల కాలంగా ఒక్కో డిపోలో రూ.15కోట్ల పైనే నష్టం వాటిల్లిదంటే ఆర్టీసీ పరిస్థితి ఏ రకం గా ఉందో అంచనా వేసుకోవచ్చు. 

ఆరు డిపోలలో మూడున్నరవేల మంది కార్మికులు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని ఆరు ఆర్టీసీ డి పోలలో సుమారు 3,500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కో డిపోలో సుమారు 100 నుంచి 150 వరకు ఆర్టీసీ బ స్సులున్నాయి. అయితే, కరోనా వల్ల ఒక్కో డిపో పరిధిలో సు మారు 30 నుంచి 40 ఆర్టీసీ బస్సులనే బయటకు తీస్తున్నారు. అంటే ఒక్కో డిపో పరిధిలో 25 శాతం మంది కార్మికులు కూడా విధులకు వచ్చే పరిస్థితులు లేవు. ఒక్కో కార్మికుడు మూడు రోజులకు ఒకసారి విధులకు వచ్చే పరిస్థితులున్నా యి. కానీ, కార్మికులకు మాత్రం పూర్తిస్థాయిలో జీతభత్యాలు ఇవ్వాల్సిన పరిస్థితులున్నాయి. అసలే నష్టాల ఊబిలో కూరు కుపోయి ఉన్న ఆర్టీసీ కరోనా వల్ల మరింత నష్టాల్లో కూరు కుపోయింది. ఈ పరిస్థితులు ఆర్టీసీలో ప్రమాద ఘంటికల ను మోగిస్తున్నాయి. భవిష్యత్తులో ఆర్టీసీ ఉనికిని కోల్పోయే ప్రమాద పరిస్థితిలోకి చేరుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కష్టకాలం నుంచి ఆర్టీసీ ఎప్పుడు కోలుకుంటుందో అంతు చి క్కని పరిస్థితులున్నాయి.   

ఒక్కో డిపోలో నెలకు రూ.కోటి నష్టం

 - రమణ, డిపో మేనేజర్‌, బోధన్‌

కరోనా విపత్కర పరిస్థితులు ఆర్టీసీని కోలుకోని విధంగా దెబ్బతిస్తున్నాయి. దాదాపు 15 నెలల కాలంగా ఆర్టీసీ బస్సులు పూర్తి స్థాయిలో నడవడం లేదు. బోధన్‌ డిపోలో 103 బస్సులు ఉండగా.. 30 నుంచి 40 బస్సులు మాత్రమే నడు స్తున్నాయి. ప్రతీరోజు 13లక్షల రూపాయల ఆదాయం రావా ల్సి ఉండగా.. రోజుకు 3లక్షల ఆదాయం కూడా రావడం లే దు. ప్రతీరోజు డిపోలో 17లక్షల రూపాయల ఖర్చులున్నా యి.  బోధన్‌ డిపోకు దాదాపు 15 నెలల కాలంగా రూ.15కో ట్లపైనే నష్టంవాటిల్లింది. బస్సులు నడవని కారణంగా ఒక్కో కార్మికుడికి మూడు రోజులకోసారి విధులు దొరికే పరిస్థి తి  లేదు. వేతనాలు మాత్రం పూర్తిగా ఇవ్వాల్సి ఉంటుంది.

Updated Date - 2021-06-09T04:53:39+05:30 IST