లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే క్రిమినల్‌ కేసులు

ABN , First Publish Date - 2020-03-31T11:39:06+05:30 IST

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయని,

లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే క్రిమినల్‌ కేసులు

రానున్న రోజుల్లో మరింత కఠినతరం: ఎస్పీ


హిందూపురం టౌన్‌/చిలమత్తూరు/ లేపాక్షి, మార్చి 30: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయని,   దీనిని ఎవరైనా ఉ ల్లంఘిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని  ఎస్పీ స త్యఏసుబాబు హెచ్చరించారు. మండలంలోని సరిహద్దు ప్రాంతాలైన తూముకుంట చెక్‌పోస్టు, చౌళూరులో  సోమవారం  ఆయన పర్యటించి సిబ్బందికి పలు సూచనలు అందించారు.


అనంతరం పట్టణంలోని వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ భవనంలో విలేకరులతో మాట్లాడారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు ఎవరైనా అనవసరంగా ఎవరైనా రో డ్డుమీదకు వస్తే వాహనాలు సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 5 క్రిమినల్‌ కేసులు నమోదు చేశామన్నారు. రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. అన్ని రకాల గూడ్స్‌ వా హనాలు తిరిగేందుకు అనుమతి ఉందని, అయితే అం దులో ప్రజలను తరలించరాదన్నారు.


రానున్న రోజుల్లో నిబంధనలు మరింత కఠినతరం చేస్తామన్నారు. హాస్టల్లో ఉన్న విద్యార్థులకు వసతి కల్పించాల్సిందేనన్నారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్‌ నిషాంతి, అదనపు ఎస్పీ రామాంజనేయులు, డీఎస్పీ మహబూబ్‌బీషా, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. కర్ణాటకలోని బెంగళూరు నుంచి ఇతర రాష్ర్టాలకు వెళ్లే వలస కూలీలపై తనిఖీ కేంద్రాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్పీ సత్యఏసుబాబు పోలీసులకు సూచించారు. కొడికొండ చెక్‌పోస్టుని ఆయన సందర్శించి.. కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర సరిహద్దులు మూసివేత, బెంగళూరు నుంచి ఇతర రాష్ర్టాలకు వస్తున్న వలస కూలీలపై చర్యలు వంటి విషయాలపై సీఐ ధరణికిషోర్‌, ఎస్‌ఐ వెంకటేశ్వర్లనడిగి తెలుసుకున్నారు.


ఎట్టి పరిస్థితిల్లోనా ఇతర రాష్ర్టాలకు చెందిన వారిని రాష్ట్రంలోకి అనుమతించవద్దని వారిని ఆదేశించారు. లేపాక్షి మండలకేంద్రంలో ఎస్పీ  పర్యటించి  అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసొలేషన్‌ వార్డులో ఉన్న ఐదుగురి ఆరోగ్య  వివరాల ను  వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2020-03-31T11:39:06+05:30 IST