Abn logo
Oct 20 2021 @ 22:54PM

ఆస్పత్రిలో రోగుల సహాయకులకు అల్పాహారం

ఆస్పత్రిలో రోగులకు, సహాయకులకు అల్పాహారం పంపిణీ చేస్తున్న మంజులరాజనర్సు

మున్సిపల్‌ చైర్మన్‌ మంజుల రాజనర్సు

సిద్దిపేట టౌన్‌, అక్టోబరు 20 : ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి సహాయకుల ఆకలి తీరుస్తూ బాసటగా నిలవాలన్న మంత్రి హరీశ్‌రావు పిలుపు మేరకు భగవాన్‌ శ్రీ సత్యసాయి సంస్థ ముందుకొచ్చిందని సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ మంజులరాజనర్సు సూచించారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో రోగులకు, సహాయకులకు ఆమె అల్పాహార వితరణ చేసి మాట్లాడారు. రోజూ ఆయా ప్రాంతాల నుంచి వందలాది మంది నిరుపేదలు వస్తుంటారని, రోగులకు ఆస్పత్రి వారే భోజనాలు సమకూర్చుతారన్నారు. వారి వెంట ఉండే సహాయకుల వద్ద రవాణా చార్జీలు తప్ప మరేవీ ఉండక పస్తులుండాల్సిన పరిస్థితి ఉన్నదన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని భగవాన్‌ శ్రీ సత్యసాయి నిత్య అల్పాహార సేవా పథకం నిర్వాహకులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఓఎస్డీ బాలరాజు, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ తమిళఅరసు, సత్యసాయి సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు నర్సింహులు, సంస్థ ప్రతినిధులు వినోద్‌, భాస్కర్‌, నగేష్‌, గట్టు రవి, సాయి కృష్ణ, సిద్ధేశ్వర్‌, అమర్‌, యమునారాణి, ఇందిరా, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.