‘కౌన్సెలింగ్‌’కు బ్రేక్‌

ABN , First Publish Date - 2021-10-26T13:10:32+05:30 IST

కౌన్సెలింగ్‌ను..

‘కౌన్సెలింగ్‌’కు బ్రేక్‌

రిజర్వేషన్లపై సుప్రీం నిర్ణయం తర్వాతే.. 

ధర్మాసనానికి స్పష్టం చేసిన కేంద్రం


న్యూఢిల్లీ: నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌కు బ్రేక్‌ పడింది. ప్రస్తుత విద్యాసంవత్సరం ఆలిండియా కోటా సీట్లకు సంబంధించి ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకునే వరకు నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ను ప్రారంభించబోమని కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. ఈ ఏడాది జూలై 29న విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం నీట్‌ పీజీ ఆలిండియా కోటా సీట్ల (ఎంబీబీఎస్‌/బీడీఎస్‌, ఎండీ/ఎంఎస్‌/ఎండీఎస్‌)కు సోమవారం నుంచి కౌన్సెలింగ్‌ మొదలు కావాల్సి ఉంది.


అయితే.. ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్‌లకు రిజర్వేషన్లు కేటాయించడంపై కొందరు సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ సోమవారం జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. నీట్‌ అభ్యర్థుల తరఫున న్యాయవాది అరవింద్‌ దత్తార్‌ వాదనలు వినిపించారు. కేంద్రం తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ నటరాజ్‌.. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకునే వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించబోమని హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-10-26T13:10:32+05:30 IST