Abn logo
Mar 5 2021 @ 01:08AM

ర్యాలీకి బ్రేక్‌

సెన్సెక్స్‌ 599 పాయింట్లు డౌన్‌ 

మళ్లీ 51,000 దిగువకు సూచీ 


ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లో మూడు రోజుల వరుస ర్యాలీకి అడ్డుకట్ట పడింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల కారణంగా ప్రామాణిక సూచీలు మళ్లీ బేర్‌ జోన్‌లోకి ప్రవేశించాయి. ఆర్థిక సేవలు, ఇంధనం, ఐటీ స్టాకుల్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు.  గురువారం   బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 598.57 పాయింట్లు (1.16 శాతం) క్షీణించి 50,846.08 వద్ద క్లోజైంది. ప్రారంభ ట్రేడింగ్‌లో సూచీ ఏకంగా 905 పాయింట్ల వరకు పతనమైంది. కాగా ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 164.85 పాయింట్లు (1.08 శాతం) కోల్పోయి 15,080.75 వద్ద స్థిరపడింది. 

Advertisement
Advertisement
Advertisement