Jul 22 2021 @ 15:49PM

Pushpa: మరోసారి బ్రేక్‌!

ఇటీవల హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభమైన ‘పుష్ప’ షూటింగ్‌కు మరోసారి బ్రేక్‌ పడింది. హైదరాబాద్‌లో ఇప్పటికే కరోనా, లాక్‌డౌన్‌ తదితర కారణాలతో షూటింగ్‌ నిలిచిపోయిన సంగతి తెలిసిందే! దర్శకుడు సుకుమార్‌ వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతుండడంతో షూటింగ్‌ నిలిచిపోయిందని తెలిసింది. సినిమా ప్రారంభం నుంచి ఏదో ఒక కారణంతో షూటింగ్‌కు బ్రేక్‌ పడుతుంది. తాజాగా హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. సుకుమార్‌ కోలుకున్నాక మళ్లీ షూటింగ్‌ ప్రారంభిస్తారట. అల్లు అర్జున్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాదిలో మొదటి భాగాన్ని విడుదల చేస్తారట. రెండో భాగం గురించి ఇంకా క్లారిటీ లేదు.