Abn logo

బ్రెడ్ గులాబ్ జామ్

కావలసిన పదార్థాలు: పంచదార - ఒక కప్పు, నీరు - ఒక కప్పు, యాలకుల పొడి - అర టీ స్పూను, నిమ్మరసం - అర చెక్క, బ్రెడ్‌ స్లయి్‌సలు - 4, మిల్క్‌ పొడి - 2 టేబుల్‌ స్పూన్లు, క్రీమ్‌ - ఒక టేబుల్‌ స్పూను, పాలు - రెండు టేబుల్‌ స్పూన్లు, నూనె - వేగించడానికి సరిపడా.


తయారుచేసే విధానం: ముందుగా పంచదారలో నీరు పోసి, యాలకుల పొడి, నిమ్మరసం కలిపి 4 నిమిషాలు మరిగించి లేతపాకం రాగానే పక్కనుంచాలి. బ్రెడ్‌ స్లయి్‌సల అంచులు కట్‌ చేసి ముక్కలుగా చేసి మిక్సీలో బరకగా పొడి చేయాలి. ఈ పొడికి మిల్క్‌ పొడి, క్రీమ్‌, పాలు కలిపి ముద్దగా చేసి చిన్న చిన్న ఉండలు చేయాలి. వీటిని నూనెలో వేగించి పంచదార పాకంలో వేసి రెండు గంటలపాటు ఉంచి తర్వాత సర్వ్‌ చేయాలి.


బాసుందిమ్యాంగో పనీర్‌ రోల్స్‌పుచ్చకాయ హల్వాపనీర్‌ లడ్డుడ్రై ఫ్రూట్‌ లడ్డూడ్రై ఫ్రూట్‌ చిక్కీబనానా హల్వాపాలకోవా బ్రెడ్‌చిలగడ దుంపల జామూన్‌చిలగడదుంప స్వీట్‌
Advertisement
d_article_rhs_ad_1
Advertisement