Abn logo

బ్రెడ్ దోశలు

కావలసినవి: బ్రెడ్‌ స్లయిస్‌లు - 8, బొంబాయి రవ్వ - అర కప్పు, బియ్యప్పిండి - పావు కప్పు, పెరుగు - ఒక కప్పు, నీరు - అరకప్పు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - కాల్చడానికి, దోశ కారం లేదా ఆలూ మసాలా - తగినంత. 


తయారుచేసే విధానం: బ్రెడ్‌ స్లయిస్‌ల అంచులు కట్‌ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. ఒక పాత్రలో ఈ ముక్కలతో పాటు రవ్వ, బియ్యప్పిండి, పెరుగు, నీరు, ఉప్పు వేసి ఉండలు లేకుండా బాగా కలిపి 20 నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత మెత్తగా దోశల పిండిలా మిక్సీ పట్టాలి. పెనంపై నూనె రాసి దోశలు పోసుకుని మధ్యలో దోశ కారం లేదా ఆలూ మసాలా ఉంచి మడిచి సర్వ్‌ చేయాలి.

ఉల్లిపకోడీ(వీడియో)బీట్‌రూట్ దోస(వీడియో)మామిడికాయ సేమ్యా ఉప్మాఉగ్గాణి (వీడియో)పెరుగు పకోడీదహీ అంజీర్‌ కబాబ్‌పెరుగు బ్రెడ్‌ దహీ రోటీపెరుగు వడతోటకూర చెక్కలు (వీడియో)
Advertisement
d_article_rhs_ad_1
Advertisement