బ్రెజిల్‌లో గడిచిన 24 గంటల్లో 20 వేలకు పైగా కేసులు

ABN , First Publish Date - 2020-08-11T23:15:31+05:30 IST

బ్రెజిల్‌లో గడిచిన 24 గంటల్లో 22,048 కరోనా కేసులు నమోదైనట్టు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది.

బ్రెజిల్‌లో గడిచిన 24 గంటల్లో 20 వేలకు పైగా కేసులు

బ్రసిలియా: బ్రెజిల్‌లో గడిచిన 24 గంటల్లో 22,048 కరోనా కేసులు నమోదైనట్టు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 30,57,470కు చేరుకుంది. మరోపక్క గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 703 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,01,752కు చేరింది. ఇక బ్రెజిల్‌లో ఇప్పటివరకు 21 లక్షలకు పైగా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదైన దేశాల జాబితాలో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా నిలిచింది. కేసులు, మరణాల విషయంలో అమెరికా ఏ దేశానికి అందనంత ఎత్తులో ఉంది. అమెరికాలో ఇప్పటివరకు 52 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. లక్షా 66 వేల మందికి పైగా మరణించారు. ఇక ఇప్పటివరకు కేవలం అమెరికా, బ్రెజిల్ దేశాల్లో మాత్రమే లక్షకు పైగా మరణాలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో అమెరికా, బ్రెజిల్, ఇండియా, రష్యా, దక్షిణ ఆఫ్రికా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. 

Updated Date - 2020-08-11T23:15:31+05:30 IST