పోలీసులపై ప్రాంక్ చేద్దామని.. ఈ వ్యక్తి ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2021-04-13T11:26:50+05:30 IST

కరోనా మహమ్మారి బ్రెజిల్‌ను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు బ్రెజిల్ వ్యాప్తంగా కరోనా ఆంక్షలను కఠినంగా

పోలీసులపై ప్రాంక్ చేద్దామని.. ఈ వ్యక్తి ఏం చేశాడంటే..

బ్రసిలియా: కరోనా మహమ్మారి బ్రెజిల్‌ను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు బ్రెజిల్ వ్యాప్తంగా కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఆంక్షల్లో భాగంగా బీచ్‌కు వెళ్లేందుకు కూడా అనుమతి లేదు. ఇదే సమయంలో ఓ ప్రాంక్‌స్టర్ పోలీసులతో ప్రాంక్ చేద్దామని మాస్క్ లేకుండా మనిషిలానే ఉన్న ఓ బొమ్మను సావ్ పాలో నగరంలోని బీచ్‌లో నిలబెట్టాడు. పోలీసులు మనిషి అనుకుని బొమ్మ దగ్గరకు వస్తే ఆ సన్నివేశాన్ని రికార్డ్ చేయాలని ప్రాంక్‌స్టర్ అనుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత ప్రాంక్‌స్టర్ ఊహించిన విధంగానే బొమ్మ దగ్గరకు పోలీసులు చేరుకోగా.. ఈ సన్నివేశాన్ని ప్రాంక్‌స్టర్ రికార్డ్ చేసుకున్నాడు. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. వీడియో అధికారుల వరకు చేరుకోవడంతో ప్రాంక్‌స్టర్‌కు జరిమానాను విధించారు.

Updated Date - 2021-04-13T11:26:50+05:30 IST