రెండు కొవిడ్-19 టీకాలకు ఆమోదం తెలిపిన బ్రెజిల్!

ABN , First Publish Date - 2021-01-18T15:48:54+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కొవిడ్-19.. బ్రెజిల్‌లోనూ విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు అక్కడ నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రెండు కొవిడ్-19 టీకాలకు బ్రె

రెండు కొవిడ్-19 టీకాలకు ఆమోదం తెలిపిన బ్రెజిల్!

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కొవిడ్-19.. బ్రెజిల్‌లోనూ విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు అక్కడ నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రెండు కొవిడ్-19 టీకాలకు బ్రెజిల్ ఆదివారం రోజు ఆమోదం తెలిపింది. అత్యవసర వినియోగానికి చైనా‌కు చెందిన సింకోవా బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన ఆస్ట్రాజెనికా టీకాకు బ్రెజిలియన్ హెల్త్ రెగ్యూలేటర్ ఆమోదం తెలిపింది. బ్రెజిల్‌ను కొవిడ్-19 రెండో మారు కుదిపేస్తోంది. ఈ క్రమంలో బ్రెజిల్ రెండు వ్యాక్సిన్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా.. ప్రస్తుతం బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 84 లక్షల మందికిపైగా కొవిడ్ బారినపడగా ఇందులో 2లక్షల మందికిపైగా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో బ్రెజిల్ మూడో స్థానంలో ఉంది. 


Updated Date - 2021-01-18T15:48:54+05:30 IST