బ్రెజిల్ అధ్యక్షుడి ఫొటోలు వైరల్.. పక్షులకు ఆహారంపెట్టబోయి!

ABN , First Publish Date - 2020-07-16T07:30:23+05:30 IST

కరోనా వైరస్ బారినపడి.. క్వారంటైన్‌లో ఉంటున్న బ్రెజిల్ అధ్యక్షుడు నొప్పితో బాధపడుతున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో గత మంగళవారం క

బ్రెజిల్ అధ్యక్షుడి ఫొటోలు వైరల్.. పక్షులకు ఆహారంపెట్టబోయి!

బ్రెజీలియా: కరోనా వైరస్ బారినపడి.. క్వారంటైన్‌లో ఉంటున్న బ్రెజిల్ అధ్యక్షుడు నొప్పితో బాధపడుతున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో గత మంగళవారం కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. దీంతో ఆయన తన అధికార భవనాన్ని క్వారంటైన్ కేంద్రంగా చేసుకుని.. అందులో ఉంటున్నారు. ఒంటరిగా ఉండటాన్ని భారంగా భావించిన ఆయన.. కాలక్షేపం కోసం.. రియా పక్షులకు ఆహారం తినిపించడానికి వెళ్లి చేతికి గాయం చేసుకున్నారు.  జైర్ బోల్సోనారో చేతి ద్వారా రియా పక్షుల నోటికి ఆహారం అందిస్తున్న క్రమంలో ఆయన చేతిని ఓ పక్షి కరిసింది. దీంతో ఆయన నొప్పితో విలవిలలాడిపోయారు. నొప్పితో బాధ పడుతున్న ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. క్వారంటైన్‌లో ఉండటం తనకు కష్టంగా ఉందని జైర్ బోల్సోనారో అన్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపిన ఆయన.. రుచి కూడా తెలుస్తోందన్నారు. మరోమారు కరోనా పరీక్ష చేయించుకోనున్నట్లు వెల్లడించారు. 


Updated Date - 2020-07-16T07:30:23+05:30 IST