బ్రెజిల్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత!

ABN , First Publish Date - 2021-01-16T02:05:21+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 విజృంభిస్తోంది. బ్రెజిల్‌లోనూ ఈ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. ముఖ్యంగా

బ్రెజిల్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత!

బ్రెజిల్: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 విజృంభిస్తోంది. బ్రెజిల్‌లోనూ ఈ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. ముఖ్యంగా అమెజోనాస్ రాష్ట్రంలో ఈ వైరస్ చెలరేగిపోతోంది. దీంతో నిత్యం వేలాది మంది కొవిడ్ బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో ప్రాణ వాయువు అందక కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోతున్న ప్రస్తుతం అక్కడ ఏర్పడింది. ఈ విషయంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ సభ్యుడు మార్సెలో రామోస్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. మిలటరీ ట్రాన్స్‌పోర్ట్ ప్లేన్‌లో ఆక్సిజన్ సిలిండర్లను రాష్ట్ర రాజధానికి పంపించాలని ప్రభుత్వం అమెరికాను కోరిందని చెప్పారు. కాగా.. బ్రెజిల్‌లో నిన్న ఒక్కరోజే దాదాపు 70 వేల మంది కొవిడ్ బారినపడగా.. 1,151 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 83.26లక్షలకు చేరగా.. 2.07లక్షల మంది మహమ్మారికి బలయ్యారు. కొవిడ్ తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో బ్రెజిల్ మూడో స్థానంలో ఉంది. 


Updated Date - 2021-01-16T02:05:21+05:30 IST