ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసి కరోనా పీడ వదిలిద్దాం: బ్రెజిల్ అధ్యక్షుడు

ABN , First Publish Date - 2020-04-04T21:19:36+05:30 IST

బ్రెజీలాయా: దేశానికి పట్టిన కరోనా పీడ వదిలేందుకు ఆదివారం నాడు అందరూ ఉపవాసాలు ప్రార్థనలు చేయాలని బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో ప్రజలకు పిలుపునిచ్చారు.

ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసి కరోనా పీడ వదిలిద్దాం: బ్రెజిల్ అధ్యక్షుడు

బ్రెజీలాయా: దేశానికి పట్టిన కరోనా పీడ వదిలేందుకు ఆదివారం నాడు ప్రజలందరూ ఉపవాసాలు, ప్రార్థనలు చేయాలని బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో పిలుపునిచ్చారు. ఆదివారం నాడు ప్రజలందరూ ఈ విధంగా ప్రార్థనలు చేసి బ్రెజిల్ నుంచి కరోనా భూతాన్ని తరిమేయాలని కోరారు. బ్రెజిల్‌లోని పాస్టర్లు, ఇతర మతప్రచారకుల అభ్యర్థన మేరకు బోల్సోనారో ఈ ప్రకటన చేశారు. కరోనా కట్టడిలో బోల్సోనారో  విఫలమవుతున్నారనే వాదనలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఆయన ఇటీవల కొందరు మత ప్రచారకులను కలుసుకున్నారు. ఆ తరువాత ఆయన ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. ‘బ్రెజిల్‌లో మత ప్రచారకులు పాస్టర్లలతో కలసి మనందరం ప్రార్థన చేయడానికి ఓ రోజు కేటాయిద్దాం. ఆ రోజు ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసి దేశానికి పట్టిన కరోనా పీడ వదిలేలా చేద్దాం’ అని  బోల్సోనారో పిలుపునిచ్చారు.  

Updated Date - 2020-04-04T21:19:36+05:30 IST