రెండో పెద్ద బ్రాండ్‌ రిలయన్స్‌

ABN , First Publish Date - 2020-08-06T07:00:42+05:30 IST

బ్రాండింగ్‌లోనూ రిలయన్స్‌ దూసుకు పోతోంది. ఫ్యూచర్‌బ్రాండ్‌ రూపొందించిన ‘ఫ్యూచర్‌బ్రాండ్‌ ఇండెక్స్‌, 2020’లో ఆర్‌ఐ ఎల్‌ బ్రాండ్‌ మైక్రోసా్‌ఫ్టను మించి పోయింది. ఈ జాబితాలో యాపిల్‌ తొలి స్థానంలో ఉంటే...

రెండో పెద్ద  బ్రాండ్‌ రిలయన్స్‌

  • మైక్రోసాఫ్ట్‌ కన్నా పై స్థానం


న్యూఢిల్లీ: బ్రాండింగ్‌లోనూ రిలయన్స్‌ దూసుకు పోతోంది. ఫ్యూచర్‌బ్రాండ్‌ రూపొందించిన ‘ఫ్యూచర్‌బ్రాండ్‌ ఇండెక్స్‌, 2020’లో ఆర్‌ఐ ఎల్‌ బ్రాండ్‌  మైక్రోసా్‌ఫ్టను మించి పోయింది. ఈ జాబితాలో యాపిల్‌ తొలి స్థానంలో ఉంటే, ఆర్‌ఐఎల్‌ ప్రపంచంలో రెండో అతి పెద్ద బ్రాండ్‌గా నిలిచింది. పెట్రో రసాయనాల సంస్థగా ఉన్న రిలయన్స్‌ను, అనేక రంగాలకు విస్తరించేందుకు కంపెనీ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తీసుకున్న చర్యలే కంపెనీని ఈ స్థానానికి చేర్చాయని పేర్కొంది. కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ ఆధారంగా కాకుండా, ఆయా కంపెనీలపై ప్రజలకు ఉన్న అభిప్రాయాల ఆధారంగా ఈ సూచీని రూపొందించినట్టు ఫ్యూచర్‌బ్రాండ్‌ పేర్కొంది. 


Updated Date - 2020-08-06T07:00:42+05:30 IST