Jun 11 2021 @ 12:18PM

బ్ర‌హ్మాజీ యాక్ష‌న్‌... సోనూసూద్ రియాక్ష‌న్‌

కరోనా వైర‌స్ ప్ర‌భావం వ‌ల్ల సామాన్యులు, పేద‌లు చాలా ఇబ్బందుల‌నే ఎదుర్కొన్నారు. గ‌త ఏడాది మార్చి నుంచి దేశం యావ‌త్తు లాక్‌డౌన్ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలో ఆప‌న్నుల‌కు సాయం చేస్తూ సోనూసూద్ రియ‌ల్ హీరో అనిపించుకున్నారు. ఈ నేప‌థ్యంలో సీనియ‌ర్ యాక్ట‌ర్ బ్ర‌హ్మాజీ సోనూసూద్‌కు ప‌ద్మ‌విభూష‌ణ్ ఇవ్వాలని కోరాడు. నిజంగానే ఆ అవార్డ్‌కి ఆయ‌న అర్హుడ‌ని భావిస్తే... ప‌ద్మ‌విభూష‌ణ్ ఫ‌ర్ సోనూసూద్ అనే హ్యాష్ ట్యాగ్‌ను రీ ట్వీట్ చేయాల‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా కోరాడు. అయితే దీనిపై స్పందించిన సోనూసూద్‌.. ‘సోద‌రా! 135 కోట్ల మంది భార‌తీయుల ప్రేమాభిమానాలే నాకు పెద్ద అవార్డు, దాన్ని నేను ఇప్ప‌టికే సంపాదించుకున్నాను’ అని రిప్లై ఇచ్చారు. మరి భవిష్యత్తులో బ్రహ్మాజీ కోరిక నేరువేరుతుందేమో చూడాలి.