షాకింగ్ ఘటన.. పుట్టిన 12 గంటల తర్వాత బిగ్గరగా ఏడుపులు.. డాక్టర్లు కంగారు పడి పాపకు టెస్టులు చేస్తే..

ABN , First Publish Date - 2022-01-08T20:45:35+05:30 IST

పాట్నాలోని ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్‌లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది

షాకింగ్ ఘటన.. పుట్టిన 12 గంటల తర్వాత బిగ్గరగా ఏడుపులు.. డాక్టర్లు కంగారు పడి పాపకు టెస్టులు చేస్తే..

పాట్నాలోని ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్‌లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. అప్పుడే పుట్టిన పాపకు పక్షవాతం వచ్చింది. దీంతో వైద్యులు కూడా షాకవుతున్నారు. ఈ ఘటనపై అధ్యయనం చేయాల్సి ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బీహార్‌లోని పాట్నాలో ఉన్న ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్‌‌కు ఈ నెల ఆరో తేదీన పూర్ణిమా కుమారి అనే మహిళ ఇటీవల పుట్టిన చిన్నారిని తీసుకువచ్చింది. ఆ చిన్నారి జనవరి రెండో తేదీన జన్మించింది. 


పుట్టిన పన్నెండు గంటల తర్వాత ఆ బాలిక బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది. దీంతో భయపడిన తాము ఆ చిన్నారిని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో జాయిన్ చేశామని, అక్కడ టెస్ట్‌లు చేసిన డాక్టర్లు పాట్నా హాస్పిటల్‌కు పంపించారని బాలిక తల్లి చెప్పింది. ఆ బాలిక తలకు స్కాన్ చేసిన డాక్టర్లు బ్రెయిన్ హేమరేజ్‌గా తేల్చారు. మెదడులో రక్తస్రావం జరగుతున్నట్టు గుర్తించి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అలాంటి కేసు తమ సర్వీస్‌లో చూడలేదని చెబుతున్నారు. మొత్తం నాలుగు విభాగాలకు చెందిన సీనియర్ వైద్యులు ఆ బాలిక చికిత్సను పర్యవేక్షిస్తున్నట్టు హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పారు. 

Updated Date - 2022-01-08T20:45:35+05:30 IST