బ్రెయిన్‌ స్ట్రోక్‌ బాధితులకు ఊరట ఇలా!

ABN , First Publish Date - 2020-12-01T16:11:57+05:30 IST

బ్రెయిన్‌ స్ట్రోక్‌ బాధితులు త్వరగా కోలుకునేందుకు ‘లింబ్‌ ఇండిపెండెంట్‌ మో టార్‌ మెమొరీస్‌’ ఉపయోగపడతాయని గాంధీనగర్‌ ఐఐటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.

బ్రెయిన్‌ స్ట్రోక్‌ బాధితులకు ఊరట ఇలా!

లింబ్‌-ఇండిపెండెంట్‌ మోటార్‌ 

మెమొరీ సాయం: ఐఐటీ-గాంధీనగర్‌


న్యూఢిల్లీ, నవంబరు30: బ్రెయిన్‌ స్ట్రోక్‌ బాధితులు త్వరగా కోలుకునేందుకు ‘లింబ్‌ ఇండిపెండెంట్‌ మో టార్‌ మెమొరీస్‌’ ఉపయోగపడతాయని గాంధీనగర్‌ ఐఐటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ‘లింబ్‌ ఇండిపెండెంట్‌ మోటార్‌ మెమొరీస్‌’ అనే అంశాన్ని ఎక్కువగా డ్రమ్స్‌ వాయించే వారి విషయంలో ఉపయోగిస్తుంటారు. మనం డ్రమ్స్‌ వాయించాలంటే రెండు చేతులు, రెండు కాళ్లు సమన్వయంతో పనిచేయాలి. సాధనతో ఎదురుగా ఉన్న నోట్‌లోని స్వరాల కు అనుగుణంగా కాళ్లు, చేతులు అప్రయత్నంగానే కదులుతాయి. దీన్నే లింబ్‌-ఇండిపెండెంట్‌ మోటార్‌ మెమొరీ అంటారు. ఇది చికిత్సలు అందించడంలో ఫిజియో థెరపిస్టులకు బాగా ఉపయోగపడుతుందని ఐఐటీ-గాంధీనగర్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ప్రతీక్‌ ముతా బృందం పేర్కొంది. బాధితుల మెదడులో కుడి, ఎడమల్లో ఏ భాగం దెబ్బతిందో అందుకు తగ్గట్టుగా వారికి శిక్షణ ఇవ్వడంలో వ్యూహాలు రచించుకునేందుకు ఉపయోగపడుతుందని వివరించింది.


Updated Date - 2020-12-01T16:11:57+05:30 IST