Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

భారత్ వీడుతున్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఉన్నత విద్యావంతులే..

twitter-iconwatsapp-iconfb-icon

ఎన్నారై డెస్క్: భారత్‌.. ఎన్నో భౌగోళిక, సాంస్కృతిక ప్రత్యేకతలు ఉన్న దేశం. కానీ..మెరుగైన భవిష్యత్తు కోసమంటూ అనేక మంది విద్యార్థులు దేశాన్ని వీడుతున్నారు. ఇదే భారత్‌కు సమస్యగా మారిందని నిపుణులు ఎప్పుడో తేల్చేశారు. ఈ సమస్యను ‘మేథోవలస’గా అభివర్ణించారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) ప్రకారం.. భారత్ వీడుతున్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఉన్నత విద్యావంతులే.. యూనివర్శిటీ చదువు లేదా వొకేషనల్ ట్రెయినింగ్ పొందిన వారే! మరే దేశంలోనూ లేని స్థాయిలో భారత్‌లో ఇలాంటి వలసలు చోటుచేసుకుంటున్నాయని ఓఈసీడీ తెలిపింది.

అద్భుత ప్రతిభావంతులను వెలికితీసేలా నిర్మితమైన విద్యావ్యవస్థ ఓవైపు.. వీరికి సరైన అవకాశాలు కల్పించలేని ఆర్థికరంగం మరోవైపు వెరసి మేథోవలసకు దారితీస్తున్నాయనేది నిపుణుల అభిప్రాయం. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం.. ప్రతి ఐదుగురు కాలేజీ డిగ్రీ ఉన్న యువతలో ఒకరికి ఉద్యోగం లేదు. దీనికి తోడు విద్యార్థుల నైపుణ్యాలకు, అందుబాటులో ఉన్న అవకాశాలకు మధ్య పొంతన లేకపోవడం, వ్యవస్థీకృతమైన అవినీతి, పరిస్థితుల్ని మరింతగా దిగజారుస్తున్నాయి. ఈ సమస్యలు పాశ్చాత్య దేశాల్లో లేవా అంటే ఉన్నాయి కానీ.. భారత్‌లో ఉన్నంత తీవ్రవత లేదనేది నిపుణుల అభిప్రాయం. 

ఇక విదేశీ ఉద్యోగాల్లో ఉండే మంచి జీతాలు, మెరుగైన పని వాతావరణం.. భారతీయులను దేశం వీడేలా చేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో వైద్యరంగం, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం తదితర రంగాల్లో నిపుణులకు ఎంతో డిమాండ్ ఉంది. మరోవైపు.. విదేశీయుల రాక.. పాశ్చాత్య దేశాలకు కూడా ఉపయోగపడుతోంది. యూనివర్శిటీ ఫీజుల రూపంలో వారికి ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. అక్కడి యూనివర్శిటీ విద్యలోని నాణ్యతే కాకుండా.. వివిధ దేశాల విద్యార్థులకు వేదికగా.. భిన్నత్వానికి ప్రాధాన్యమిచ్చే క్యాంపస్ వాతావరణం కూడా భారతీయులను విదేశీ యూనివర్శిటీల వైపు పరుగులు తీసేలా చేస్తోంది. చదువు తరువాత కూడా అక్కడే ఉద్యోగం చేసుకునే అవకావం మరో ఆకర్షణగా మారింది. 

హెచ్-1బీ వంటి ఉద్యోగాధారిత వీసాలు కూడా భారతీయులే అధిక సంఖ్యలో చేజిక్కించుకుంటున్నారు. సృజనాత్మక ఆలోచనలు కలిగిన ఇన్నోవేటర్స్‌కు, అంకుర సంస్థలు ఏర్పాటు చేసే ఓత్సాహిక వ్యాపారవేత్తలకూ పాశ్చాత్య దేశాలు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాయి. 2019లో పాశ్చాత్య దేశాల బాట పట్టిన భారత విద్యార్థుల సంఖ్య 7.7 లక్షలు కాగా.. 2024 కల్లా ఈ సంఖ్య ఏకంగా 18 లక్షలకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పాశ్చాత్య విద్యలో ఇన్ని సానుకూలాంశాలు ఉన్న నేపథ్యంలో వలసలు ఈ అంచనాను మించినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.