వైభవంగా వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-10-20T06:33:35+05:30 IST

స్థానిక కీటిన్‌పేట ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ప్రధానార్చకులు పురాణం శేషాచార్యులు, సహాయార్చకులు మనోజ్‌కుమారాచార్యులు ఆధ్వర్యంలో ఉదయం యాగశాల్చానలు, విశేషహోమాలు జరిగాయి.

వైభవంగా వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు
శ్రీఐశ్వర్యలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు

భీమునిపట్నం, అక్టోబరు 19: స్థానిక కీటిన్‌పేట ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ప్రధానార్చకులు పురాణం శేషాచార్యులు, సహాయార్చకులు మనోజ్‌కుమారాచార్యులు ఆధ్వర్యంలో ఉదయం యాగశాల్చానలు, విశేషహోమాలు జరిగాయి. అనంతరం, శ్రీదాసాంజనేయస్వామి వారికి పంచామృతాభిషేకాలు, తమలపాకులు, సిందూరంతో సహస్రనామార్చనలు, హనుమాన్‌ చాలీసాతో పంచహారతులు జరిగాయి. వేంకటేశ్వరస్వామి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కలిగొట్ల సూర్యనారాయణమూర్తి పర్యవేక్షణలో మధ్యాహ్నం శ్రీఐశ్వర్య లక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం, సుజాతనగర్‌ బాల సరస్వతి నాట్యమండలి కళాకారిణులు ప్రదర్శించిన కాళికామాత, మహిషాసుర మర్దిని నృత్యాలు భక్తులను అలరించాయి. ఈ సందర్భంగా, కళాకారులకు నిర్వాహకులు జ్ఞాపికలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో  చారిటబుల్‌ ట్రస్ట్‌ డైరెక్టర్లు కలిగొట్ల శ్రీరామచంద్రమూర్తి, కలిగొట్ల వెంకట భానోజీరావు, కలిగొట్ల శ్రీనివాసరావు, కోశాధికారి వుశిరికల బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-20T06:33:35+05:30 IST