Brahmos missile misfire: బ్రహ్మోస్ క్షిపణి మిస్‌ఫైర్ ఘటన.. ముగ్గురు ఎయిర్ ఫోర్స్ అధికారులపై వేటు

ABN , First Publish Date - 2022-08-24T02:14:57+05:30 IST

ఈ ఏడాది మార్చిలో జరిగిన బ్రహ్మోస్ క్షిపణి మిస్‌ఫైర్ (Brahmos missile misfire) ఘటనకు సంబంధించి ముగ్గురు

Brahmos missile misfire: బ్రహ్మోస్ క్షిపణి మిస్‌ఫైర్ ఘటన.. ముగ్గురు ఎయిర్ ఫోర్స్ అధికారులపై వేటు

న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చిలో జరిగిన బ్రహ్మోస్ క్షిపణి మిస్‌ఫైర్ (Brahmos missile misfire) ఘటనకు సంబంధించి ముగ్గురు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF) అధికారులపై ప్రభుత్వం వేటేసింది. వీరిలో గ్రూప్ కెప్టెన్‌తోపాటు ఇద్దరు వింగ్ కమాండర్లు కూడా ఉన్నారు. విధుల నుంచి వీరిని తక్షణం తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది మే 9న  పంజాబ్‌ (Punjab)లోని అంబాలా వాయుసేన స్థావరంలో సాధారణ నిర్వహణ తనిఖీలు చేస్తుండగా ఓ క్షిపణి అకస్మాత్తుగా గాల్లోకి లేచి పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లి పంజాబ్ ప్రావిన్సులో పడింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 


ఈ ఘటనపై  రక్షణ శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. తాజాగా ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముగ్గురు అధికారులపై వేటు వేశారు. నియమావళి(SOP) సరిగా పాటించకపోవడమే ఈ ఘటనకు కారణమని నివేదిక పేర్కొంది. అందుకు ముగ్గురు అధికారులు బాధ్యులని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం వీరిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  

Updated Date - 2022-08-24T02:14:57+05:30 IST