Abn logo
Aug 5 2020 @ 19:42PM

అయోధ్య రాముడు.. నెటిజన్లను ఫిదా చేసిన బ్రహ్మానందం!

హాస్య బ్రహ్మగా తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న సీనియర్ కమెడియన్ బ్రహ్మానందంలో ఎన్నో అద్భుత కళలున్నాయి. గతంలో వెంకటేశ్వర స్వామి ప్రతిమను బ్రహ్మానందం స్వయంగా తయారు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక, లాక్‌డౌన్ సమయంలో తన చిత్రకళను కూడా బయటపెట్టారు. కరోనాపై అద్భుతమైన చిత్రం గీశారు. తాజాగా మరోసారి బ్రహ్మానందం తన ట్యాలెంట్‌తో ఆకట్టుకున్నారు. 


అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన సందర్భంగా బ్రహ్మానందం రాముడి చిత్రాన్ని గీశారు. రాముడిని ఆంజనేయుడు ఆలింగనం చేసుకుని తన్మయత్వంతో కన్నీళ్లు కారుస్తున్నట్టు బ్రహ్మానందం చిత్రించారు. అయోధ్యలో రాముడికి గుడి కడుతున్న సందర్భంగా హనుమంతుడు ఆనందపడుతున్నట్టు ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. బ్రహ్మానందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 


Advertisement
Advertisement
Advertisement