OHRK live: సీఎం ఒక్కడే ఉంటాడు ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో బ్రహ్మాజీ

ABN , First Publish Date - 2022-08-14T21:14:53+05:30 IST

సూపర్‌స్టార్‌ కృష్ణకు వీరాభిమానినిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు బ్రహ్మాజీ. హాస్యనటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులు ఆదరాభిమానాలు పొందారు. మరో రెండళ్లలో థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ అనిపించుకోనున్నారు. తాజాగా ఆయన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో పాల్గొన్ని 28 ఏళ్ల తన సినీ కెరీర్‌, వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నారు.

OHRK live: సీఎం ఒక్కడే ఉంటాడు ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో బ్రహ్మాజీ

సూపర్‌స్టార్‌ కృష్ణకు వీరాభిమానినిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు బ్రహ్మాజీ(Brahmaji). హాస్యనటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులు ఆదరాభిమానాలు పొందారు. మరో రెండళ్లలో థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ అనిపించుకోనున్నారు. తాజాగా ఆయన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ (Open heart With RK) కార్యక్రమంలో పాల్గొన్ని 28 ఏళ్ల తన సినీ కెరీర్‌, వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నారు. పాలిటిక్స్‌పై ఇంట్రెస్ట్‌  లేదని చెప్పిన ఆయన రాజకీయా వ్యవస్థ రొట్ట.. రచ్చ అయిపోయిందని వ్యాఖ్యానించారు. సినిమాల కన్నా రాజకీయలే ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్నారని కామెంట్‌ చేశారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎలాంటి రిగ్రెట్స్‌ లేవనీ, ఐఎఎస్‌, ఐపీఎస్‌కి ఎంత గౌరవం ఉంటుందో నటులకు అంతే గౌరవం ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి పంచుకున్నారు. 


28 ఏళ్ల సినీ జర్నీలో ఫస్టాఫ్‌ కన్నా సెకెండాఫ్‌ చాలా బావుంది. ప్రతి ఒక్కరికీ సెకెండాఫ్‌ బాగుండాలని కోరుకుంటాను. నా విషయంలో అదే జరిగింది. కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను. మనం అకౌంట్‌ నుంచి ఎప్పుడు ఎంత డ్రా చేయాలనేది ఫిక్సిడ్‌ డిపాజిట్‌లో ఉంటుంది.  అది మనం డ్రా చేసుకుంటూ వెళ్తామంతే! 


రాజకీయ పార్టీలు కావచ్చు... ఫ్యాన్‌ బేస్‌ కావచ్చు కొందరు లెజెండ్స్‌ ఉన్నారు. వాళ్లందరినీ కలిపి మనం గౌరవించుకోవాలి. వాళ్లను కామెంట్‌ చేయకూడదు. వాళ్లను అలా వదిలేద్దాం. 


ప్రేమించే వయసులోనే ప్రేమలో పడ్డాను. ఇప్పుడు ప్రేమిస్తానంటే కొడతారు. సినిమాల్లోకి వచ్చి అవకాశాలు లేని రోజుల్లోనే ప్రేమలో పడి బెంగాలీ అమ్మాయిని పెళ్లా చేసుకున్నా. ఇంట్లో తెలుగు, తమిళ, ఇంగ్లిష్‌లో మాట్లాడుకుంటాం. బయటి వాళ్లు ఎవరన్నా ఉంటే తమిళంలో మాట్లాడుకుంటాం. 


నటుడిగా బ్రేక్‌ ఇచ్చిన కృష్ణవంశీని బ్రహ్మాజీ ఎందుకు బెదిరిస్తారు? (Krishna vamsi)

బ్రహ్మాజీ ఎవడు... అంటూ అతన్ని కొట్టడానికి రెండ్రోజులపాటు తిరిగింది ఎవరు? 

అన్నయ్యగా భావించే చిరంజీవిని ఎవరైనా ఏదన్నా అంటే తట్టుకోలేకపోవడానికి కారణమేంటి? 

స్నేహితుడైన రవితేజ గురించి ఏం చెప్పారు. (Raviteja)

తోటి నటులతో సమాన స్థాయికి చేరుకోకపోవడానికి రీజన్‌ ఏంటి? 

‘కేబినెట్‌లో మంత్రులు చాలామంది ఉండొచ్చు.. రాష్ట్రానికి సీఎం ఒకడే ఉంటాడు. అందరూ సీఎంలు కాలేరు’ అనడం వెనకున్న కారణమేంటి? అన్న ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు బ్రహ్మాజీ. 





Updated Date - 2022-08-14T21:14:53+05:30 IST