Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 17 Aug 2022 08:44:02 IST

Suhas కి హాస్య బ్రహ్మ ఆశీర్వాదం..!

twitter-iconwatsapp-iconfb-icon

కమెడియన్, హీరో సుహాస్‌ (Suhas)ని హాస్య బ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam) ఆశీర్వదించారు. సుహాస్‌ ప్రస్తుతం తెలుగు సినిమాలతో బాగా పాపులర్ అయ్యాడు. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందు కొన్ని లఘు చిత్రాలలో నటించి దర్శకుల దృష్ఠిని ఆకర్షించాడు. దాంతో 2015లో వచ్చిన దోచేయ్ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత నటించిన పడిపడి లేచేమనసు, మజిలీ చిత్రాలు సుహాస్‌ని ప్రేక్షకులను బాగా దగ్గర చేశాయి. ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజూ పండగే, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి చిత్రలు మరింత గుర్తింపును తెచ్చిపెట్టాయి.

ఈ క్రమంలో సుహాస్‌కి అనుకోకుండా కలర్ ఫొటో సినిమాలో హీరో పాత్ర చేసే అవకాశం దక్కింది. చాందినీ చౌదరీ హీరోయిన్‌గా, సునీల్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకి సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. సినిమా విడుదలయ్యాక అందరి నుంచి గొప్ప ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా సుహాస్‌కి ఈ సినిమా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చి పెట్టింది. అంతేకాదు, ఈ చిత్రానికి జాతీయ అవార్డు దక్కడం గొప్ప విశేషం. అయితే, సుహాస్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Suhas కి హాస్య బ్రహ్మ ఆశీర్వాదం..!

మన టాలీవుడ్ హాస్య బ్రహ్మ అయిన బ్రహ్మానందంతో కలిసి ఉన్న పిక్‌ని సుహాస్ షేర్ చేశాడు. ఇందులో తనకి బ్రహ్మానందం ఆశీస్సులు అందించినట్టుగా ఓ కార్డు పై రాసిన పిక్ కూడా జతచేశాడు. ఈ కార్డులో బ్రహ్మానందం "సుహాస్ కి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను.. శుభమస్తు" అని రాశారు. దీనితో ఈ పోస్ట్ ఇపుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా సుహాస్ ఆనందం వ్యక్తం చేశాడు.   


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement