Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 06 Aug 2022 12:43:25 IST

Brad Pitt: 'బుల్లెట్ ట్రైన్' చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు..

twitter-iconwatsapp-iconfb-icon

అకాడమీ అవార్డు గెలుచుకున్న హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ (Brad Pitt) మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ వెండితెరపై 'బుల్లెట్ ట్రైన్' (Bullet Train) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య రూపొందిన ఈ యాక్షన్-కామెడీ చిత్రం  ఆగస్ట్ 4వ తేదీన భారీ స్థాయిలో విడుదలైంది. మరోసారి భారీ యాక్షన్ సన్నివేశాలు, కామెడీతో పాటు నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్‌తో అలరిస్తున్నారు. 

ట్రాయ్, మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ వంటి బ్లాక్ బస్టర్ అవార్డ్ విన్నింగ్ సినిమాలలో తన మాజీ భార్య ఏంజెలీనా జోలీతో కలిసి నటించారు. ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్, టరాన్టినోస్ ఇన్గ్లోరియస్ బాస్టర్డ్స్, మనీబాల్, ఓషన్స్ – ఓషన్స్ ఎలెవెన్, ట్వెల్వ్ లాంటి బ్లాక్ బస్టర్ అవార్డ్ మూవీస్‌లో నటించి అసాధారణమైన పాపులారిటీని సంపాదించుకున్నారు. క్వెంటిన్ టరాన్టినో యొక్క వన్స్ అపాన్ ఎ టైమ్‌లో అకాడమీ అవార్డు గెలుచుకున్న ప్రదర్శనలను హాలీవుడ్‌లో లియోనార్డో డికాప్రియో, యాడ్ ఆస్ట్రాతో కలిసి భ్రాడ్ పిట్ అందించారు. 

ఇప్పుడు ఆయన తన తాజా చిత్రం బుల్లెట్ ట్రైన్‌తో మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేశారు. దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళను రాబడుతోంది. సూపర్‌సోనిక్ స్పీడ్, హై-ఆక్టేన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో, బ్రాడ్ పిట్ నటనతో ఈ సినిమా థ్రిల్లింగ్‌ అలాగే, హాస్యభరితంగా ఉందని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమాకు 'డెడ్‌పూల్ 2' రూపొందించిన దర్శకుడు డేవిడ్ లీచ్ దర్శకత్వం వహించారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement