జాతీయ అథ్లెటిక్స్‌కు ఎంపిక

ABN , First Publish Date - 2021-01-25T06:01:33+05:30 IST

రాష్ట్ర అథ్లెటిక్స్‌ 100 మీటర్ల పరుగుపందెంలో ద్వితీయస్థానాన్ని సాధించిన బీఆర్‌ స్టేడియంకు చెందిన హర్షవర్ధన్‌ ఫిబ్రవరి 6న అసోంలో జరిగే జాతీయ అథ్ల్లెటిక్స్‌కు ఎంపికయ్యారు.

జాతీయ అథ్లెటిక్స్‌కు ఎంపిక
క్రీడాకారుడు హర్షవర్ధన్‌ను అభినందిస్తున్న బీ.ఆర్‌ స్టేడియం అధ్లెటిక్స్‌ కార్యవర్గ సభ్యులు

గుంటూరు(క్రీడలు), జనవరి 24: రాష్ట్ర అథ్లెటిక్స్‌ 100 మీటర్ల పరుగుపందెంలో ద్వితీయస్థానాన్ని సాధించిన బీఆర్‌ స్టేడియంకు చెందిన హర్షవర్ధన్‌ ఫిబ్రవరి 6న అసోంలో జరిగే జాతీయ అథ్ల్లెటిక్స్‌కు ఎంపికయ్యారు. అథ్ల్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా చైర్మన్‌ శేషయ్య, కోచ్‌ రవికుమార్‌, సంఘ కార్యదర్శి జీవీఏస్‌ ప్రసాదు తదితరులు హర్షవర్ధన్‌ను అభినందించారు. 

అథ్లెటిక్స్‌ పోటీలు ప్రారంభం

 స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియంలో ఆదివారం మాస్టర్‌ అథ్లెటిక్‌ పోటీలను నిర్వహించారు. 122 మంది పురుషులు, 62 మంది మహిళలు పోటీల్లో పాల్గొన్నారని మాస్టర్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు షేక్‌ లాల్‌వజీర్‌ అన్నారు. ప్రతిభచూపిన క్రీడాకారులు చత్తీస్‌ఘడ్‌లో జరిగే పోటీలకు ఎంపికవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగేష్‌ కన్నా, మూర్తి, స్వరూప్‌, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-25T06:01:33+05:30 IST