Top 10 Bikes: కుర్రకారు తెగ కొనేశారు.. ఆగస్టు నెలలో అమ్ముడుపోయిన టాప్ 10 బైక్స్ లిస్ట్ ఇదీ..!

ABN , First Publish Date - 2022-09-21T17:26:46+05:30 IST

రోజు రోజుకూ మారుతున్న మోడల్స్ కి తగినట్టు మంచి ధరతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల బైక్స్ లాంచ్ చేసేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయి.

Top 10 Bikes: కుర్రకారు తెగ కొనేశారు.. ఆగస్టు నెలలో అమ్ముడుపోయిన టాప్ 10 బైక్స్ లిస్ట్ ఇదీ..!

భారత్ లోనే టూవీలర్ అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంది, దానికి తగినట్టు మార్కెట్ ఉంది. 19 కోట్లకు పైగా బైకులు మన రోడ్లపై తిరుగుతున్నాయి. రోజు రోజుకూ మారుతున్న మోడల్స్ కి తగినట్టు మంచి ధరతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల బైక్స్ లాంచ్ చేసేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయి. 


- స్ప్లెండర్ అగ్రస్థానంలో ఉంది.


- సిబి షైన్ రెండో స్థానంలో నిలిచింది.


- సీటీ, హెచ్‌ఎఫ్ డీలక్స్ అమ్మకాలు కాస్త తగ్గాయి.


దేశంలోని చాలా ద్విచక్ర వాహన తయారీదారులకు ఆగస్టు నెల బాగానే కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. గత నెల పరిశ్రమలో మంచి అభివృద్దే కనిపించింది. దీని కారణంగా గత నెలలో చాలా మోటార్‌సైకిళ్లకు పెద్దగానే అమ్మకాలు పెరిగాయి. ఆగస్టు 2022లో అత్యధికంగా అమ్ముడైన మోటార్‌సైకిళ్ల గురించి తెలుసుకుందాం. 


1. స్ప్లెండర్ బ్రాండ్ గత నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన బైక్‌గా నిలిచింది. ఆగస్ట్ 2021తో పోల్చితే హీరో మోటోకార్ప్ గత నెలలో 18 శాతం ఎక్కువగా అమ్ముడుపోయింది. గత నెలలో మొత్తం 2,86,007 యూనిట్ల స్ప్లెండర్ బైక్‌లు విక్రయించారు. 


2. రెండవ స్థానంలో అత్యధికంగా అమ్ముడైన హోండా CB షైన్. దీని అమ్మకాలు 8 శాతం పెరిగి మొత్తం 1,20,139 యూనిట్లు అమ్ముడయ్యాయి. 


3. బజాజ్ ప్లాటినా 99,987 యూనిట్లతో మూడవ స్థానంలో నిలిచింది. గత నెలలో బజాజ్ ప్లాటినా మొత్తం 77 శాతంగా ఉండి ఒక్కసారిగా దూసుకుపోయింది.


4. ఇక్కడ ఈ నెలలో అత్యధికంగా అమ్మకమైన కొన్ని బైక్‌లు టాప్ 10 జాబితాలోకి తీసుకుంటే వాటి అమ్మకాలు మంచి మార్జిన్‌తో తగ్గాయి. 


5. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ విక్రయాలు 37 శాతం తగ్గి 72,224 యూనిట్లకు చేరుకున్నాయి. 


6. బజాజ్ CT డీలక్స్ కూడా 24,094 యూనిట్ల వద్ద 9 శాతంగా నిలిచాయి. 


ఈ నెలతో పాటు వచ్చే నెలలో కూడా పండుగల సీజన్ కారణంగా మొత్తంగా వీటి విక్రయాలు పెరిగే అవకాశం ఉంది.



Updated Date - 2022-09-21T17:26:46+05:30 IST