వంటింట్లో ఉన్న భార్య.. తలుపు తీసిన భర్త.. ఎదురుగా కనిపించిన యువతిని చూసి షాక్.. చివరకు సీన్ రివర్స్..!

ABN , First Publish Date - 2021-07-30T16:35:12+05:30 IST

కొత్త దంపతులు ఇంట్లో ఉండగా ఓ యువతి అక్కడకు వచ్చింది.. తలుపు తీసి ఆ యువతిని చూసి భర్త షాకయ్యాడు..

వంటింట్లో ఉన్న భార్య.. తలుపు తీసిన భర్త.. ఎదురుగా కనిపించిన యువతిని చూసి షాక్.. చివరకు సీన్ రివర్స్..!

కొత్త దంపతులు ఇంట్లో ఉండగా ఓ యువతి అక్కడకు వచ్చింది.. తలుపు తీసి ఆ యువతిని చూసి భర్త షాకయ్యాడు.. ఆమెను దూషించాడు.. చంపేస్తానని బెదిరించాడు.. దీంతో ఆమె విషం తాగేసింది.. కుటుంబ సభ్యులు కాపాడడంతో బతికి పోయింది.. చివరకు పోలీసులను ఆశ్రయించి న్యాయం కోసం పోరాడుతోంది.. బీహార్‌లోని గయకు చెందిన ఓ యువతి ప్రేమికుడి చేతిలో మోసపోయిన ఘటన ఇది. 


గయకు చెందిన ఓ యువతి.. బిపిన్ యాదవ్ అనే యువకుడితో ఎప్పట్నుంచో ప్రేమాయాణం సాగిస్తోంది. పదేళ్ల పాటు వీరి బంధం కొనసాగింది. ఈ పదేళ్లలో బిపిన్ యాదవ్ అన్ని విధాలుగానూ ఆమెను ఉపయోగించుకున్నాడు. సొంత భార్యతో ఉన్నట్టే ఉండేవాడు. ఆమె పెళ్లి గురించి ఎన్నిసార్లు అడిగినా తప్పించుకునేవాడు. ఒకరోజు సిందూరం నుదిటిన పెట్టి పెళ్లి అయిపోయినట్టే అన్నాడు. దీంతో ఆ యువతి అతడిని బాగా నమ్మింది. అయితే ఆ యువకుడు ఆమెకు తెలియకుండా మరో అమ్మాయిని గత నెలలో పెళ్లి చేసుకున్నాడు. 


ఆ విషయం తెలుసుకున్న యువతి నేరుగా బిపిన్ యాదవ్ ఇంటికి వెళ్లి నిలదీసింది. దీంతో బిపిన్ అసలు స్వరూపం బయటపడింది. `నువ్వెవరో నాకు తెలియదు` అంటూ దాడికి తెగబడ్డాడు. దీంతో ఆమె ఇంటికి వెళ్లి విషం తాగేసింది. కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చేర్పించడంతో బతికి బయటపడింది. అనంతరం ఆమె గురువారం నేరుగా జిల్లా ఎస్పీని కలిసి బిపిన్ యాదవ్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ కేసును దర్యాఫ్తు చేస్తున్నారు.  


Updated Date - 2021-07-30T16:35:12+05:30 IST