విశ్వంత్, మాళవిక జంటగా నటిస్తున్న చిత్రం ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హయర్’. విజయదశమి సందర్భంగా ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ‘‘ఈతరం యువత ఆలోచనలు ప్రతిబింబించే చిత్రమిది. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి’’ అని దర్శకుడు సంతోశ్ కంభంపాటి అన్నారు. ‘‘ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. చిత్రీకరణ పూర్తయింది. సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు వేణుమాధవ్ పెద్ది, కె. నిరంజన్‌రెడ్డి చెప్పారు.