అలియా ప్రేమకు రణ్‌బీర్ ఫ్లాట్ అయ్యి ఉంటాడు అనుకుంటున్నారు బాలీవుడ్ సినీజనాలు. ఆమె రూ. 32 కోట్లు పెట్టి ముంబైలోని ఓ అపార్ట్మెంట్లో ప్లాట్ కొన్నారు. ఇప్పటికే అలియాకు ముంబైలోని జుహూలో, లండన్ లోని కోవెంట్ గార్డెన్లో సొంత ఇళ్లున్నాయి. మరి ఇప్పుడు ఈ ప్లాట్ ఎందుకంటే ప్రియుడు రణబీర్‌కపూర్‌కు చేరువయ్యేందుకు? అదేంటి వారిద్దరూ ఇప్పుడు దూరంగా ఉంటున్నారా? అనుకుంటున్నారా? అలాంటిదేం లేదు. రణబీర్‌కు మరింత దగ్గరగా ఉండాలనుకున్న అలియా బాంద్రాలో అతను ఉంటున్న అపార్ట్మెంట్లో తను కూడా ఓ ప్లాట్ కొన్నారు. రణ్‌బీర్ ఏడో అంతస్తులో ఉంటుంటే, అలియా ఐదో అంతస్తులో ఫ్లాట్ తీసుకున్నారు. ఇటీవల లక్ష్మీపూజ చేసి గృహప్రవేశ కార్యక్రమం కూడా ముగించారు. రణ్‌బీర్‌కపూర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఇంటీరియర్ డిజైనింగ్ చేసే బాధ్యతను షారూఖ్‌ఖాన్ భార్య గౌరీఖాన్‌కు అలియా అప్పగించారు.