భూపాలపల్లి: స్వాతంత్య్ర వేడుకలను బహిష్కరించాలని సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సంవత్సర కాలం పాటు ఆజాదీకీ అమృత్ మహోత్సవాల పేరుతో ప్రధాని నరేంద్రమోదీ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మేధావులు, సామాజిక కార్యకర్తలు, రచయితలు, పౌరహక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామిక వాదులపైనా బీమాకోరేగావ్ వంటి తప్పుడు కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. జైలులో బంధించటంతో పాటు అర్బన్ నక్సలైట్లు అని ముద్ర వేస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే 84ఏళ్ల వయో వృద్ధుడు స్టాన్‌స్వామి మరణం చోటు చేసుకుందని తెలిపారు. ఈ నిర్బంధ పద్ధతలు కేవలం మావోయిస్టులపైనే అమలు కావటం లేదని, కాశ్మీర్ వాసులపై, ఈశాన్య రాష్ర్టాల ఉద్యమాలు, చివరికి ప్రతిపక్ష పార్టీలు, ప్రజలపైనా కూడా అమలవుతున్నాయని అభయ్ ధ్వజమెత్తారు.