చైనాను బహిష్కరించాలంటూ.. అమెరికాలో..

ABN , First Publish Date - 2020-07-04T21:53:38+05:30 IST

‘చైనాను బహిష్కరించాలి’ అంటూ న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఇండియన్

చైనాను బహిష్కరించాలంటూ.. అమెరికాలో..

న్యూయార్క్: ‘చైనాను బహిష్కరించాలి’ అంటూ న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఇండియన్ అమెరికన్స్ భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ అమెరికన్స్‌తో పాటు టిబెట్‌కు చెందిన వారు, తైవానీస్ అమెరికన్స్ కూడా పాల్గొన్నారు. భారత్-చైనా సరిహద్దుల వద్ద ఇటీవల జరిగిన ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు మరణించిన విషయం తెలిసిందే. దీని తర్వాత చైనాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు భారత్ అనేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో భారతీయులు చైనాకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నారు. చైనా యాప్‌లను నిషేధించడమే కాకుండా భారత ప్రభుత్వం చైనాను అన్ని విధాలుగా బహిష్కరించాలని నిరసనకారులు పిలుపునిచ్చారు. మరోపక్క టిబెట్, తైవానీస్ అమెరికన్స్ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని తన ఆందోళనను వ్యక్తం చేశారు. చైనా నుంచి టిబెట్‌కు పూర్తి స్వాతంత్ర్యం రావాలని టిబెట్‌కు చెందిన నిరసనకారులు పేర్కొన్నారు. చైనాను వాణిజ్య పరంగా బహిష్కరించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షించో అబే నేతృత్వంలో ప్రపంచదేశాలన్ని ఏకమవ్వాలని నిరసనకారులు తెలియజేశారు.

Updated Date - 2020-07-04T21:53:38+05:30 IST