బోయకొండ గంగమ్మ హుండీ ఆదాయం రూ.73 లక్షలు

ABN , First Publish Date - 2022-06-28T06:11:31+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మకు హుండీ లెక్కింపు ద్వారా రూ.73 లక్షలు ఆదాయం సమకూరినట్లు ఆలయ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈవో చంద్రమౌళి పేర్కొన్నారు.

బోయకొండ గంగమ్మ హుండీ ఆదాయం రూ.73 లక్షలు
హుండీ లెక్కిస్తున్న సిబ్బంది

చౌడేపల్లె, జూన్‌ 27: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మకు హుండీ లెక్కింపు ద్వారా రూ.73 లక్షలు ఆదాయం  సమకూరినట్లు ఆలయ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈవో చంద్రమౌళి పేర్కొన్నారు. సోమవారం అమ్మవారి హుండీ లెక్కించారు. రూ.73,46,412 నగదు, 72 గ్రాముల బంగారు, 950 గ్రాములు వెండి, 10 విదేశీ కరెన్సీ నోట్లు, 29 కాయిన్స్‌ వచ్చినట్టు తెలిపారు. ఈ మొత్తం 49 రోజుల్లో భక్తులు అమ్మవారికి హుండీ ద్వారా  సమర్పించారన్నారు. ఈ ఆదాయాన్ని చౌడేపల్లె సప్తగిరి గ్రామీణ బ్యాంకు నందు డిపాజిట్‌ చేసిన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రూప్‌ టెంపుల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శశికుమార్‌, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణిమ, శ్రావణి,  సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T06:11:31+05:30 IST