రాజరాజేశ్వరీదేవిగా బోయకొండ గంగమ్మ

ABN , First Publish Date - 2022-10-07T06:48:29+05:30 IST

దసరా మహోత్సవాల్లో చివరి రోజైన బుధవారం బోయకొండ గంగమ్మ రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

రాజరాజేశ్వరీదేవిగా బోయకొండ గంగమ్మ
రాజరాజేశ్వరీదేవి అలంకారంలో దర్శనం ఇస్తున్న బోయకొండ గంగమ్మ

చౌడేపల్లె, అక్టోబరు 6: దసరా మహోత్సవాల్లో చివరి రోజైన బుధవారం బోయకొండ గంగమ్మ రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి రెండు చేతులలో కమలాలు, ఒక చేయి అభయ హస్తంగా, మరో చేతిలో చెరకు గడతో చతుర్భుజాలతోను.. స్వర్ణాభరణాలతో రాజరాజశ్వరీదేవిగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి అద్దాల మండపం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తిని అలంకరించి, కలశ స్థాపన చేసి అలంకరించారు. మహా గణపతి, ఆదిత్యాధి నవగ్రహ, దుర్గ చండీ, మృత్యుంజయేశ్వర, రుద్ర  హోమాలు నిర్వహించారు. ఉభయదారులకు ఆలయ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈవో చంద్రమౌళి అమ్మవారి శేషవస్త్రాలను, తీర్థప్రసాదాలను అందించారు. దసరా మహోత్సవాలు చివరి రోజున వేలాది మంది భక్తులు తరలి రావడంతో క్యూలైన్లు కిక్కిరిశాయి. 


Updated Date - 2022-10-07T06:48:29+05:30 IST