Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 23 Mar 2022 17:58:58 IST

బోయగూడ ఘటన దురదృష్టకరం: హోం మంత్రి మహమూద్

twitter-iconwatsapp-iconfb-icon
బోయగూడ ఘటన దురదృష్టకరం: హోం మంత్రి మహమూద్

హైదరాబాద్: నగరంలోని బోయగూడలో జరిగిన అగ్నిప్రమాదం సంఘటన దురదృష్టకరమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ ప్రమాదంపై పోలీస్ , జీహెచ్ఎంసీ . ఫైర్ అధికారులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోయగూడ అగ్నిప్రమాదంలో 11 మంది చనిపోయారన్నారు. నగరంలో ఎక్కడెక్కడ ఇలాంటి గోదాములలో పనిచేస్తున్నారనే వివరాలు సేకరించాలని అదేశాలు ఇచ్చామని ఆయన తెలపారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరామన్నారు. ప్రజల మధ్య ఉన్న ఇలాంటి గోదాములను గుర్తించాలని అధికారులను ఆదేశించామన్నారు. గోదాములలో రాత్రివేళల్లో కూలీలు ఉండకుండా చూడాలని కోరామన్నారు. కూలీలకు వసతిని యజమానులు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 


ఇప్పటికే 11 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయ్యిందని ఆయన తెలిపారు. రేపు ఉదయం మృతదేహాలను తమ స్వస్థలానికి తరలిస్తామని ఆయన పేర్కొన్నారు. నగరంలో ఉన్న గోదాములను గుర్తించి నిబంధనలు పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వలస కూలీల కోసం లాక్ డౌన్‌ సమయంలో స్పెషల్ ట్రైన్స్‌ను సీఎం ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.