పదేళ్ల బాలుడి వీడియో.. కదలిన యంత్రాంగం..

ABN , First Publish Date - 2020-09-22T11:43:09+05:30 IST

తాత సాగు చేసిన పొలం నీట మునగడంతో ఆవేదన చెంది ఆ బాలుడు తీసిన వీడియో యాదాద్రి భువనగిరి జిల్లా అధికార యంత్రాంగాన్ని కదిలించింది. వలిగొండ

పదేళ్ల బాలుడి వీడియో.. కదలిన యంత్రాంగం..

యాదాద్రి భువనగిరి (ఆంధ్రజ్యోతి): తాత సాగు చేసిన పొలం నీట మునగడంతో ఆవేదన చెంది ఆ బాలుడు తీసిన వీడియో యాదాద్రి భువనగిరి జిల్లా అధికార యంత్రాంగాన్ని కదిలించింది. వలిగొండ మండలం అర్రూరులో దోతి అయిలయ్య వరి పైరు నీట మునిగిన వైనంపై ఆయన మనుమడు వరుణ్‌ మెడ లోతు నీటిలో నిలబడి చేసిన విజ్ఞప్తిని ‘రైతంటే సినిమాలో చూపించినట్టు ఉండడు’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన యాదాద్రి కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ రైతు సమస్యపై విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో తహసీల్దార్‌ నాగలక్ష్మి, వ్యవసాయ అధికారి అంజనీదేవి సోమవారం అయిలయ్య పొలాన్ని పరిశీలించారు. సమస్య పరిష్కారం కోసం కాండ్లకుంట బావికుంట తూము వెడల్పు కోసం నీటిపారుదల శాఖకు సిఫారసు చేస్తామని తెలిపారు.

Updated Date - 2020-09-22T11:43:09+05:30 IST