స్కూలు బస్సును దొంగిలించిన 11 ఏళ్ల బాలుడు.. అమెరికాలో..

ABN , First Publish Date - 2020-10-14T07:41:59+05:30 IST

అమెరికాలో స్కూలు బస్సును దొంగిలించిన 11 ఏళ్ల బాలుడిని పోలీసులు

స్కూలు బస్సును దొంగిలించిన 11 ఏళ్ల బాలుడు.. అమెరికాలో..

లూజియానా: అమెరికాలో స్కూలు బస్సును దొంగిలించిన 11 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లూజియానా రాష్ట్రంలో గత ఆదివారం ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాళం లేకపోయినా బస్సు స్టార్ట్ అవుతుందనే విషయం తెలుసుకున్న బాలుడు బస్సును స్టార్ట్ చేసి రోడ్డు మీదకు వచ్చాడు. బాలుడిని పట్టుకునేందుకు పోలీసులు చేజింగ్ కూడా చేయాల్సి వచ్చింది.


పోలీసులు వెంబడిస్తున్నారని బాలుడు బస్సును స్పీడుగా తోలుతూ గ్యాస్ లైన్‌ను కూడా ఢీ కొట్టాడు. అనంతరం ఓ చెట్టును ఢీకొట్టడంతో బస్సు ఆగిపోయింది. వెంటనే పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. బాలుడికి కనీసం బస్సులో పెడల్స్ కూడా అందవని.. బస్సును కూడా నిలబడి డ్రైవ్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. కాగా.. బాలుడిపై దొంగతనం కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు.

Updated Date - 2020-10-14T07:41:59+05:30 IST