Chhattisgarhలో బోరు బావిలో పడిన బాలుడు...రక్షించిన ఎన్డీఆర్ఎఫ్,ఆర్మీ

ABN , First Publish Date - 2022-06-15T13:24:32+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని జాంజ్‌గిర్ చంపా జిల్లాలో బోర్‌వెల్‌లో పడిపోయిన బాలుడిని ఎన్డీఆర్ఎఫ్,ఆర్మీ దళాలు రక్షించాయి...

Chhattisgarhలో బోరు బావిలో పడిన బాలుడు...రక్షించిన ఎన్డీఆర్ఎఫ్,ఆర్మీ

రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని జాంజ్‌గిర్ చంపా జిల్లాలో బోర్‌వెల్‌లో పడిపోయిన బాలుడిని ఎన్డీఆర్ఎఫ్,ఆర్మీ దళాలు రక్షించాయి.రాహుల్ సాహు  సమయంలో ఆడుకుంటూ మల్ఖరోడా డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని పిహ్రిద్ గ్రామంలోని తన ఇంటి పెరట్లో ఉన్న ఉపయోగించని 80 అడుగుల లోతైన బోర్‌బావిలో పడిపోయాడు.బాలుడు 60 అడుగుల లోతులో ఇరుక్కుపోయాడు. దీంతో హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చిన అధికారులు బావిలో ఆక్సిజన్ సరఫరా కోసం పైప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు.మంగళవారం రాత్రి 104 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత బాలుడిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), సైన్యం, స్థానిక పోలీసులు, పరిపాలన అధికారులతో సహా 500 మందికి పైగా సిబ్బంది  భారీ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. 


‘‘అందరి ప్రార్థనలు,రెస్క్యూ టీమ్ అవిశ్రాంతంగా, అంకితభావంతో చేసిన కృషితో రాహుల్ సాహు సురక్షితంగా బయటపడ్డాడు. బాలుడిని స్ట్రెచర్‌లో తీసుకెళ్లినట్లు టెలివిజన్ విజువల్స్ చూపించాయి’’ అని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ట్వీట్ చేశారు.బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని త్వరగా కోలుకుంటాడని వైద్యులు చెప్పారు. బాలుడిని బిలాస్‌పూర్ జిల్లాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2022-06-15T13:24:32+05:30 IST